AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కార్పోరేటర్లకు కేటీఆర్ క్లాస్.. 15మందికి సీరియస్ వార్నింగ్

త్వరలో ఎన్నికలు జరగనున్న గ్రేటర్ హైదరాబాద్‌పై మునిసిపల్ పరిపాలనా శాఖా మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతీ రోజూ గ్రేటర్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఏదో ఒక కార్యక్రమానికి మంత్రి పూనుకుంటున్నారు.

కార్పోరేటర్లకు కేటీఆర్ క్లాస్.. 15మందికి సీరియస్ వార్నింగ్
Rajesh Sharma
|

Updated on: Sep 29, 2020 | 1:35 PM

Share

KTR focusing on greater elections: త్వరలో ఎన్నికలు జరగనున్న గ్రేటర్ హైదరాబాద్‌పై మునిసిపల్ పరిపాలనా శాఖా మంత్రి కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతీ రోజూ గ్రేటర్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఏదో ఒక కార్యక్రమానికి మంత్రి పూనుకుంటున్నారు. ఇందులోభాగంగా మంగళవారం బంజారాహిల్స్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో కేటీఆర్ నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు,కార్పోరేటర్లతో సమావేశమయ్యారు.

బల్దియా ఎన్నికలతో పాటు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై హైదరాబాద్ నగర ప్రజాప్రతినిధులు, కార్పోరేటర్‌లతో సమావేశంలో కేటీఆర్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నవంబరు రెండో వారం తరువాత ఏ క్షణం అయిన గ్రేటర్ ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం వుంది.. అందరూ సిద్ధంగా ఉండాలి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15 మంది కార్పొరేటర్ల పనితీరు బాగాలేదని సర్వేలో తేలింది.. ఇప్పటికైనా పనితీరు మార్చుకోండి… ’’ అంటూ కేటీఆర్ క్లాస్ తీసుకున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 60 వేల కోట్ల రూపాయలు వెచ్చించినట్లు కేటీఆర్ వివరించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యేల దృష్టికి తీసుకురావాలని ఆయన కార్పొరేటర్లకు సూచించారు. ‘‘ నిత్యం ప్రజల్లో ఉండండి..గల్లీ గల్లీ తిరిగి సమస్యలు తెలుసుకొని తెలియజేయండి.. అవసరమయితే గ్రేటర్ అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేస్తాం.. ప్రతి కార్పోరేటర్ 3 వేల గ్రాడ్యుయేట్ ఓట్లు నమోదు చేయించాలి.. అక్టోబర్ 1న ప్రజాప్రతినిధులు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి…’’ అని హితబోధ చేశారు కేటీఆర్.