మునిసి‘పోల్స్’పై కేటీఆర్ ఫోకస్..రోజూ ఏం చేస్తున్నారంటే?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గేరు మార్చారు.. స్పీడు పెంచారు. మంత్రిగా తన పోర్టుఫోలియోను పర్యవేక్షిస్తూనే పార్టీ బాధ్యతల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు కేటీఆర్. తాజాగా ఆయన మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలో పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. చురుకుగా లేని నేతలకు క్లాస్‌ పీకుతున్నారు. అభివృద్ది కార్యక్రమాల కోసం నిధులు అడగడానికి వెళుతున్న నాయకులను, ప్రోగ్రెస్‌ రిపోర్టు ముందేసి కడిగి పారేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. […]

మునిసి‘పోల్స్’పై కేటీఆర్ ఫోకస్..రోజూ ఏం చేస్తున్నారంటే?
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 12, 2019 | 4:57 PM

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు గేరు మార్చారు.. స్పీడు పెంచారు. మంత్రిగా తన పోర్టుఫోలియోను పర్యవేక్షిస్తూనే పార్టీ బాధ్యతల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు కేటీఆర్. తాజాగా ఆయన మున్సిపల్‌ ఎన్నికలపై దృష్టి సారించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ తరహాలో పక్కా వ్యూహంతో ముందుకెళుతున్నారు. నియోజకవర్గాలవారీగా పార్టీ పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. చురుకుగా లేని నేతలకు క్లాస్‌ పీకుతున్నారు. అభివృద్ది కార్యక్రమాల కోసం నిధులు అడగడానికి వెళుతున్న నాయకులను, ప్రోగ్రెస్‌ రిపోర్టు ముందేసి కడిగి పారేస్తున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. మొత్తానికి తాను బిజీగా మారటమే కాదు నేతలను కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు కేటీఆర్‌.

గులాబీ పార్టీలో మున్సిపల్ హీట్‌ పెరుగుతోంది. ఎన్నికల కసరత్తులో భాగంగా వీక్‌గా ఉన్న నేతలను అప్రమత్తం చేస్తున్నారు కేటీఆర్. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై అరా తీస్తూ మంచి చెడులు తెలుసుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికలకు హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీని ఎన్నికలకు సిద్ధం చెయ్యడంలో వర్కింగ్ ప్రెసిడెంట్‌ బిజీ అయ్యారు.

మున్సిపల్‌ ఎన్నికల ప్రిపరేషన్ కోసం ఎమ్మెల్యేలు, మంత్రులతో నిత్యం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న కేటీఆర్ పార్టీ కమిటీల ఎంపికను పూర్తి చెయ్యని నేతలకు క్లాస్ పీకుతున్నారట. ఎన్నికలు వస్తున్నాయి మాకు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇవ్వమని అడిగేందుకు వెళుతున్న నాయకులకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందేసి మరీ కడిగేస్తున్నారని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీల నియమక ప్రక్రియకు గడువు ముగిసినా ఏర్పాటు చెయ్యకుండా పెండింగ్‌లో పెట్టిన మంత్రులకు గట్టిగానే తలంటుతున్నారట వర్కింగ్ ప్రెసిడెంట్.

ఒక వైపు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నా కొందరు నాయకులు సమాయత్తం కావటంలేదని కేటీఆర్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. తెలంగాణ భవన్ నుండి వివరాలు తెప్పించుకుని అలసత్వం ప్రదర్శిస్తున్న నాయకులకు ఫోన్ చేసి వివరణ అడుగుతూనే అగ్రహం చేస్తున్నారు. దీంతో నేతలు అంతా తమ నియోజకవర్గాల్లో పెండింగులో ఉన్న కమిటీలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసే పనిలో పడ్డారు. నిధుల కోసం వెళ్తున్న నాయకులకు కేటీఆర్ ఇస్తున్న షాక్‌తో మిగతా నేతలు ఆయన దగ్గరకు వెళ్ళకముందే సరిదిద్దుకుంటున్నారు.

అటు గులాబీ బాస్ కేసీఆర్ మున్సిపల్ ఎన్నికలపై సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్నారు. అందుకే కేటీఆర్ ఎన్నికలను ఛాలెంజ్‌గా తీసుకొని లోటుపాట్లను సరిద్దితున్నారు. కమిటీల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసి తన వద్దకు రావాలని హెచ్చరించడంతో నేతలు అంతా ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై అనేక సమీక్షలు చేసిన కేటీఆర్ ఇప్పుడు ఫైనల్ టచ్‌గా మరోమారు అలర్ట్ చేస్తున్నారు.