AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna District: అందరికీ సేమ్ రూల్స్.. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 27 మంది పోలీసులుపై కేసులు నమోదు..

కృష్ణా  జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ పెట్టకోకుండా ఎవరూ కనబడినా కేసులు నమోదు చేయాలని సూచించారు. 

Krishna District: అందరికీ సేమ్ రూల్స్.. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న 27 మంది పోలీసులుపై కేసులు నమోదు..
No Helmet Cases
Ram Naramaneni
|

Updated on: Jul 03, 2021 | 10:59 PM

Share

–27 మంది పోలీసులకు జరిమానా..

–మొత్తం 127 నో హెల్మెట్ కేసులు నమోదు చేసిన బందరు ట్రాఫిక్ పోలీసులు..

–హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు

కృష్ణా  జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు సిబ్బందికి కఠిన ఆదేశాలు జారీ చేశారు. హెల్మెట్ పెట్టకోకుండా ఎవరూ కనబడినా కేసులు నమోదు చేయాలని సూచించారు.   ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకుండా ప్రయాణిస్తుండగా జరుగుతున్నాయని.. ఎక్కవ మంది ప్రాణాలు కోల్పోడానికి కూడా కారణం అదే అని ఆయన దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు పెద్ద ఎత్తున, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, హెల్మెట్ ర్యాలీలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని ఎస్పీ  సూచించారు. అంతేకాదు  హెల్మెట్ ధరించకుండా తిరుగుతున్న పోలీసులపై కూడా కేసు నమోదు చేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.

దీంతో తాజాగా ట్రాఫిక్ డిఎస్పి పి. భరత్ మాతాజీ ఆధ్వర్యంలో బందరు ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, మొత్తం 127 నో హెల్మెట్ కేసులు నమోదు చేశారు. అందులో 27 కేసులు పోలీసులుపై నమోదు చేయడం గమనార్హం. చట్టం ముందు అందరూ సమానమే అని, అది అందరికీ వర్తిస్తుందని కనుక రోడ్డు మీదకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణాలు కొనసాగించాలని ట్రాఫిక్ డిఎస్పి భరత్ మాతాజీ చెప్పారు.  అనుకోని విధంగా ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ అనేది సంజీవనిలా ఉపయోగ పడుతుందని ఆయన అన్నారు.

Also Read: ‘ఇండియన్-2’ వివాదం.. హైకోర్టులో డైరెక్టర్‌ శంకర్‌కు ఊరట

 కింగ్ కోబ్రా గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..