నిత్యానందపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన త‌మిళ న‌టి

ఇటీవ‌ల మీరా మిథున్ అనే పేరు త‌రుచూ వార్త‌ల్లో వినిపిస్తోంది. ఏదో ఒక వివాదాన్ని ఆమె ముందుకు తెస్తూ ఉంటుంది. సూర్య నుంచి విజ‌య్ , విశాల్‌ వ‌ర‌కు స్టార్ హీరోల‌ను కూడా వ‌దిలి పెట్ట‌కుండా వారిపై ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంది. ఇటీవ‌లే విశాల్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని..

నిత్యానందపై పొగడ్త‌ల వ‌ర్షం కురిపించిన త‌మిళ న‌టి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 28, 2020 | 11:36 AM

ఇటీవ‌ల మీరా మిథున్ అనే పేరు త‌రుచూ వార్త‌ల్లో వినిపిస్తోంది. ఏదో ఒక వివాదాన్ని ఆమె ముందుకు తెస్తూ ఉంటుంది. సూర్య నుంచి విజ‌య్ , విశాల్‌ వ‌ర‌కు స్టార్ హీరోల‌ను కూడా వ‌దిలి పెట్ట‌కుండా వారిపై ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూనే ఉంది. ఇటీవ‌లే విశాల్ త‌న‌ను పెళ్లి చేసుకుంటాన‌ని వెంటప‌డుతున్నాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి ఓ వీడియో రిలీజ్ చేసింది. కానీ డ‌బ్బు, పేరున్న వారిని పెళ్లి చేసుకోవ‌డం నాకు ఇష్టం లేదు. అందుకే పెళ్లికి నిరాక‌రించిన‌ట్టుగా ఆమె పేర్కొంది. అంతే కాకుండా త‌న త‌ల్లికి విశాల్ అంటే చాలా ఇష్ట‌మ‌ని, కానీ అత‌న్ని వివాహం చేసుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని మీరా మిథున్ వ్యాఖ్యలు చేసింది. ఇది చూసిన విశాల్ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేశారు.

ఇక ఇప్పుడు ఆమె మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. గ‌తంలో లైంగిక ఆరోప‌ణ‌లు ఎదురుకున్న ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద.. భార‌త దేశం నుంచి పారిపోయి.. కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న స‌ప‌రేటుగా క‌రెన్సీ కూడా ఏర్పాటు చేసుకున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో నిత్యానందపై మీరా మిథున్ పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించింది. నిత్యానంద గురించి అంద‌రూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారని త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొంది. అంతేకాకుండా తాను కూడా కైలాస దేశానికి వెళ్లాల‌నుకుంటున్నాన‌ని వెల్ల‌డించింది. లాట్స్ ఆఫ్ ల‌వ్ అంటూ త‌న ప్రేమ‌ను కురిపించింది న‌టి మీరా మిథున్.

Read More:

వ‌ర‌ల్డ్ కరోనా అప్‌డేట్స్.. 2.46కోట్ల‌కి చేరిన పాజిటివ్ కేసులు