కింగ్ కోటి ఆసుపత్రిలో కరోనా కలకలం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి 213 దేశాలకు పాకింది. గంట గంటకూ కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికాలో అయితే కరోనా మరణ మృదంగం వాయిస్తోంది. తెలంగాణాలో ఇప్పటివరకు మొత్తం 5,406 కేసులు నమోదు కాగా.. 191 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రం 3,027 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం వివిధ అస్పత్రుల్లో చికిత్స పొందున్న యాక్టివ్ కేసుల సంఖ్య 2,188 ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 261 మంది డిశ్చార్జ్ అయ్యారు.
తాజాగా కోఠీలోని ఈ ఎన్ టి ఆస్పత్రి సూపరిండెంట్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కింగ్ కోఠీ ఆస్పత్రి ఇంచార్జి సూపరిండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ శంకర్, ప్రస్తుతం ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన హోమ్ క్వారైంటైన్ లో ఉన్నారు. ఇప్పటికి ఇద్దరు ఆసుపత్రి సూపరింటెండెంట్లకు కరోనా పాజిటివ్ గా తేలింది. మూడు రోజుల క్రితం కొండాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.