వియ్యంకుడిపై రెచ్చిపోయిన కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్
కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ కేశవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను నా సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో నాలుగేళ్లు జైల్లో ఉండి వచ్చాను.. నాకున్న అప్పుల కంటే మూడురెట్లు ఆస్తులు ఉన్నాయి.. ఇద్దరు వ్యక్తుల వల్ల నేను ఇప్పటికీ నష్టపోతున్నాను. ఇద్దరు దుర్మార్గుల నుంచి నాకు ఇప్పటికీ ప్రాణ హాని ఉంది. ఒకరు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. రెండోది శ్రీచైతన్య యాజమాన్యం. నా ఆస్తులన్నీ ఈ ఇద్దరూ కబ్జా చేశారు.. […]
కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ కేశవరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “నేను నా సంస్థలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో నాలుగేళ్లు జైల్లో ఉండి వచ్చాను.. నాకున్న అప్పుల కంటే మూడురెట్లు ఆస్తులు ఉన్నాయి.. ఇద్దరు వ్యక్తుల వల్ల నేను ఇప్పటికీ నష్టపోతున్నాను. ఇద్దరు దుర్మార్గుల నుంచి నాకు ఇప్పటికీ ప్రాణ హాని ఉంది. ఒకరు మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి. రెండోది శ్రీచైతన్య యాజమాన్యం. నా ఆస్తులన్నీ ఈ ఇద్దరూ కబ్జా చేశారు.. మొత్తంగా ఎనిమిది వందల కోట్ల ఆస్తులను ఆదినారాయణరెడ్డి, శ్రీచైతన్య యాజమాన్యం కబ్జా చేశారు. టీడీపీ ప్రభుత్వం కూడా శ్రీచైతన్య యాజమాన్యానికి సహకరించింది. గుంటూరు, విజయవాడ మధ్యలో 50కోట్ల విలువైన నా ప్రాపర్టీని లాక్కున్నారు..
ఇక వీళ్ల దుర్మార్గాలు సాగవు.. కబర్దార్.. నేను రాయలసీమలో పుట్టినవాడిని.. మర్యాదగా మీరిద్దరూ నా ఆస్తులన్నింటినీ ఇచ్చేసి బయటకు పోండి. వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోతే ఆదినారాయణరెడ్డి బతుకేంటి? అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. నా వియ్యంకుడు అయి ఉండి నన్ను నిలువునా ముంచాడు. నన్ను బూచీగా చూపి పార్టీలు మారాడు. నేను కూడా రాయలసీమ రెడ్డినే.. నీ ఫ్యాక్షనిజం నా దగ్గర చెల్లదు. ఈ పభుత్వంలో మీ ఆటలు చెల్లవు. జగన్ తో ఢీకొనే సత్తా ఆదినారాయణరెడ్డికి ఉందా..?” అంటూ తీవ్ర స్థాయిలో తిరుపతిలో విరుచుకుపడ్డారు కేశవరెడ్డి. (మా నాన్న కేశవరెడ్డి మాటలన్నీ అబద్దాలే : భరత్ రెడ్డి)