జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్, అందుకు గ్రీన్ సిగ్నల్

అదనపు రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 2,525 కోట్లు అప్పుగా తీసుకోవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.

జగన్ సర్కార్ కు కేంద్రం గుడ్ న్యూస్, అందుకు గ్రీన్ సిగ్నల్
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 02, 2020 | 6:15 PM

అదనపు రుణం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొత్తం 2,525 కోట్లు అప్పుగా తీసుకోవచ్చంటూ కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కొవిడ్‌ సంక్షోభం కారణంగా ఆదాయం తగ్గిన దృష్ట్యా… కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఒకే దేశం-ఒకే రేషన్‌, ఈజ్ ఆఫ్ డూయింగ్ లో సంస్కరణలు అమలు చేసినందుకు అదనపు రుణం తీసుకునేలా అనుమతి లభించింది. సంస్కరణల్లో భాగంగా  ఒకే దేశం-ఒకే రేషన్‌ అమల్లో ఉత్తరప్రదేశ్ ఆరో స్థానంలో నిలవడంతో ఆ రాష్ట్రం కూడా అదనపు రుణం పొందేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో యూపీ అదనంగా 4,851 కోట్లు పొందే అవకాశం ఉంది. కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం ఈ సౌలభ్యం కల్పించింది.(కిలాడీ వాలంటీర్, పింఛన్ డబ్బులు కొట్టేయడానికి మాస్టర్ స్కెచ్ !)