సూర్య కోసం స‌త్యదేవ్ గాత్ర దానం !

త‌మిళ స్టార్ హీరో సూర్య కోసం తెలుగు రైజింగ్ హీరో స‌త్య‌దేవ్ కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నారు. `జ్యోతిలక్ష్మి`, 'బ్రోచే వారెవ‌రురా', 'బ్లఫ్ మాస్టర్' 'ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య' వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ అందుకున్నారు స‌త్య‌దేవ్‌.

  • Ram Naramaneni
  • Publish Date - 5:55 pm, Fri, 2 October 20
సూర్య కోసం స‌త్యదేవ్ గాత్ర దానం !

త‌మిళ స్టార్ హీరో సూర్య కోసం తెలుగు రైజింగ్ హీరో స‌త్య‌దేవ్ కొత్త అవ‌తారం ఎత్త‌బోతున్నారు. `జ్యోతిలక్ష్మి`, ‘బ్రోచే వారెవ‌రురా’, ‘బ్లఫ్ మాస్టర్’ ‘ఉమా మ‌హేశ్వ‌ర ఉగ్ర రూప‌స్య’ వంటి విభిన్నమైన చిత్రాలతో ప్రేక్షకుల నుంచి మంచి అప్లాజ్ అందుకున్నారు స‌త్య‌దేవ్‌. అతడు హీరోగా సినిమా వస్తుందంటే అది కచ్చితంగా విలక్షణంగా ఉంటుందన్న అభిప్రాయం సినీ ప్రేమికుల్లో వచ్చింది.  ప్ర‌స్తుతం ఇతడు మూడు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నారు. వ‌రుస చిత్రాల‌తో బిజీగా వున్న ఆయ‌న హీరో సూర్య కోసం గాత్ర దానం చేయనున్నారు. (Nishabdham Movie Review : ‘నిశ్శబ్దం’ మూవీ రివ్యూ)

త‌మిళంలో హీరో సూర్య తాజాగా `సూరా‌రై పోట్రు` సినిమా చేశారు.  సుధ కొంగ‌ర దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో `ఆకాశ‌మే నీహ‌ద్దురా`. . పేరుతో రాబోతుంది. 2డీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య న‌టిస్తూ నిర్మిస్తున్న ఈ సినిమాలోని సూర్య పాత్ర‌కు హీరో స‌త్య‌దేవ్ డ‌బ్బింగ్ చెప్పారని తెలుస్తోంది. ఇటీవల తెలుగు వెర్ష‌న్‌కు సూర్య డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. అయితే ఆయన తెలుగు అంత స్ప‌ష్టంగా రాక‌పోవ‌డంతో, స‌త్య‌దేవ్ వాయిస్ న‌చ్చి అత‌ని చేత త‌న పాత్ర‌కు సూర్య డ‌బ్బింగ్ చెప్పించుకున్నార‌ట‌. ఈ మూవీ త్వ‌ర‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో రీలీజ్ కానుంది. ‌(బిగ్ బాస్ హౌస్ లో నేడు ఫ్యాషన్ షో, అవినాష్ కామెడీ అదుర్స్ !)