కిలాడీ వాలంటీర్, పింఛన్ డబ్బులు కొట్టేయడానికి మాస్టర్ స్కెచ్ !

ఏపీలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. కరోనా సమయంలో వారి సేవలు నిజంగా ప్రశంసించదగినవి. మరోవైపు అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అందడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు.

కిలాడీ వాలంటీర్,  పింఛన్ డబ్బులు కొట్టేయడానికి మాస్టర్ స్కెచ్ !
Follow us

|

Updated on: Oct 02, 2020 | 3:13 PM

ఏపీలోని గ్రామ వాలంటీర్ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. కరోనా సమయంలో వారి సేవలు నిజంగా ప్రశంసించదగినవి. మరోవైపు అర్హులైనవారికి సంక్షేమ పథకాలు అందడంలో వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొందరు చేసే తప్పుడు పనులు వల్ల వ్యవస్థకే చెడ్డపేరు వస్తుంది. తాజాగా ఓ వాలంటీర్ పన్నిన పన్నాగం ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

అనంతపురం జిల్లా మడకశిర మున్సిపాలిటీలోని శివపురంలో ఈరప్ప అనే వ్యక్తి వాలంటీర్ విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే నిన్న 1 వ తారీఖు కావడంతో లబ్ధిదారులకు అందిచాల్సిన పింఛన్ డబ్బు రూ. 43,500 తీసుకువెళ్తుండగా,  కొందరు దుండగలు తన కళ్లలో కారం కొట్టి..దాడి చేసి ఆ సొత్తును లాక్కెళ్లారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాడిలో తనకు తీవ్ర గాయాలు అయ్యాయంటూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అయితే అతను చెబుతున్న మాటలు తేడా కొట్టడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో విచారణ చేయగా డబ్బు కాజేయడానికి సదరు వాలంటీర్ కట్టుకథ అల్లినట్లు తేలింది. దీంతో అతడిని విధుల నుంచి తొలగించాలని మడకశిర మున్సిపల్ కమిషనర్ నాగార్జున కు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు జారీ చేశారు.

Also Read :

వైసీపీలోకి గంటా కుమారుడు, సాయి రెడ్డి ఏమన్నారంటే !

“ఆ” చాట్ చెయ్యాలట, దెబ్బకు చిప్పకూడు తింటున్నాడు