- Telugu News Photo Gallery Business photos Amazon Great Summer Sales 2024: Special offers on smartphones, smartwatches from 2nd to 6th May
Amazon Sales 2024: అమెజాన్‌లో వీటిపై ప్రత్యేక ఆఫర్లు.. వద్దనుకున్నా వస్తువు కొనేయాల్సిందే..
ప్రపంచ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్ 2024 ప్రారంభమైంది. అద్భుతమైన అఫర్లతో వినియోగదారులకు పసందైన ఫుల్ మీల్స్ లాంటి బంపర్ బొనాంజా అందించేందుకు సిద్దమైంది. ప్రస్తుత జనరేషన్ ఏ వస్తువు కొనాలన్నా ఆన్లైన్ షాపింగ్ వైపుకే మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం తమకు కావల్సిన ఫీచర్స్, డిస్కౌంట్ ప్రైస్, కస్టమర్ రివ్యూ, ప్రోడక్స్ రేటింగ్, కస్టమర్ సర్వీస్, రిటర్న్ పాలసీ ఇలా అనేక రకాల గొప్ప అవకాశాలను కల్పించడమే అంటున్నారు.
Updated on: May 03, 2024 | 7:28 PM

ప్రపంచ దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్స్ 2024 ప్రారంభమైంది. అద్భుతమైన అఫర్లతో వినియోగదారులకు పసందైన ఫుల్ మీల్స్ లాంటి బంపర్ బొనాంజా అందించేందుకు సిద్దమైంది. ప్రస్తుత జనరేషన్ ఏ వస్తువు కొనాలన్నా ఆన్లైన్ షాపింగ్ వైపుకే మొగ్గు చూపుతున్నారు.

దీనికి కారణం తమకు కావల్సిన ఫీచర్స్, డిస్కౌంట్ ప్రైస్, కస్టమర్ రివ్యూ, ప్రోడక్స్ రేటింగ్, కస్టమర్ సర్వీస్, రిటర్న్ పాలసీ ఇలా అనేక రకాల గొప్ప అవకాశాలను కల్పించడమే అంటున్నారు. ప్రతిసారి ఎలక్ట్రానిక్, ఫర్నీచర్, హోం అప్లియెన్సెస్లపై ఏదో ఒక అద్భుతమైన ఆఫర్లతో కనువిందు చేసే అమెజాన్ ఈ సారి కూడా మంచి బంపర్ ఆఫర్లను ప్రకటించింది.

వీటితో పాటు రూ.15,000, రూ.25,000 లోపు ధర ఉన్న స్మార్ట్ ఫోన్‌లపై ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. వీటిని కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటున్నారు అమెజాన్ ప్రతినిధులు తెలిపారు. మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతుందని అమెజాన్ సంస్థ ప్రకటించింది.

ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్‌ప్లస్‌తో పాటు ఇతర ఫోన్‌ల ధరపై భారీ తగ్గింపు ఉంటుందని చెబుతున్నారు. ఇలా తక్కువ ధరకే మంచి వారంటీతో సూపర్ గుడ్ ప్రొడక్స్ కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ సంస్థ తమ కొనుగోలు దారులకు కల్పిస్తుంది.

ఈ ఫోన్‌లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది. స్మార్ట్‌వాచ్‌లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌పై 95శాతం, ఇయర్‌ఫోన్‌లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్‌ఫోన్స్‌పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.

అమెజాన్ సమ్మర్ సేల్స్ అందించే అఫర్లతో పాటు మీకు ఐసీఐసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఉంటే వాటి ద్వారా మరింత ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్‌లు కూడా వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది.




