కేరళలో మళ్లీ ‘నిఫా’ వైరస్ పంజా.. ఓ వ్యక్తికి పాజిటివ్

గతేడాది కేరళను వణికించిన నిఫా వైరస్ మరోసారి ఆ రాష్ట్రంపై పంజా విసిరింది. 23ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ లక్షణాలు సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అతడికి ఎర్నాకులంలోని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పుణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డాక్టర్లు ఆ వ్యక్తికి నిఫా వైరస్ సోకినట్లు స్పష్టం చేశారని శైలజ పేర్కొన్నారు. కాగా మరోవైపు జ్వరంతో బాధపడుతోన్న 86మందిని […]

కేరళలో మళ్లీ ‘నిఫా’ వైరస్ పంజా.. ఓ వ్యక్తికి పాజిటివ్
Follow us

| Edited By:

Updated on: Jun 04, 2019 | 7:03 PM

గతేడాది కేరళను వణికించిన నిఫా వైరస్ మరోసారి ఆ రాష్ట్రంపై పంజా విసిరింది. 23ఏళ్ల వ్యక్తికి ఈ వైరస్ లక్షణాలు సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ అధికారికంగా ధృవీకరించారు. ప్రస్తుతం అతడికి ఎర్నాకులంలోని ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. పుణెకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డాక్టర్లు ఆ వ్యక్తికి నిఫా వైరస్ సోకినట్లు స్పష్టం చేశారని శైలజ పేర్కొన్నారు. కాగా మరోవైపు జ్వరంతో బాధపడుతోన్న 86మందిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలుస్తోంది.

జ్వరం, తలనొప్పి, నీరసం, మరియు మెదడుపైన కూడా పడే అవకాశం ఉంది నిర్ణయాలు తీసుకునే అంశంలో తడబడి కోమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జ్వరంతో నిరసించిపోయి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతారని తరువాత మగత చెంది మెదడుపై ప్రభావితమైతుందని తద్వారా మనిషి కోమాలోకి వెళ్లి మరణిస్తారని తెలుపుతున్నారు వైద్యులు.

వాక్సిన్ అందుబాటులో లేని ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సత్వర చికిత్సతో తగ్గించుకోవచ్చు. 1988 సంవస్సరంలో మలేషియాలో తొలిసారిగా గుర్తించిన ఈ వైరస్ బాదతదేశం లోని కేరళలో గబ్బిలాలతో వ్యాపించింది. ఈ వైరస్ పందులు, గబ్బిలాలు, మనుషులద్వారా కూడా వ్యాపించగలదు.

పక్షులు, జంతువులు తాకిన పండ్లు, కూరగాయలు, పానీయాలు తీసుకోవద్దు. మార్కెట్లో లభించే పండ్లు, కూరగాయలు తీసుకున్నా వాటిని శుభ్రంగా కడిగి మాత్రమే తినండి. పండ్లపై మచ్చలు పడినా వాటిని తీసుకోకపోవడమే ఉత్తమం. కోజికోడ్ జిల్లాలో గబ్బిలాల వ్యర్దాలు కలిసిన ఒక బావిలో వైరస్ ఉందని గుర్తించి ఆ బావిని మూసివేయడం జరిగింది. గబ్బిలాలు తాకిన పళ్ళు, పానీయం ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపించింది అని తెలిసింది.

ఇదిలా ఉంటే నిఫా వైరస్‌‌పై ఆందోళన అవసరం లేదని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై యుద్ధాన్ని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. కోచిలోని ఎర్నాకులం మెడికల్ కాలేజీలో ఇందుకోసం ప్రత్యేక వార్డును ఏర్పాటుచేశామని మంత్రి శైలజ వెల్లడించారు. ఇదిలా ఉంటే గతేడాది ఈ వైరస్ వలన కేరళలో 17మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..
ఓటర్లకు బంపరాఫర్‌.. ఓటు వేస్తే ఫ్రీగా బీర్‌, బిర్యానీతో పాటు..