ఎర్రవెల్లి ఇంటి వివరాలందజేసిన కేసీఆర్

తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్తుల నమోదు ప్రక్రియలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వున్న కేసీఆర్‌ను గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్...

ఎర్రవెల్లి ఇంటి వివరాలందజేసిన కేసీఆర్
Follow us

|

Updated on: Oct 10, 2020 | 4:55 PM

KCR disclosed Erravelli house details: తెలంగాణవ్యాప్తంగా కొనసాగుతున్న ఆస్తుల నమోదు ప్రక్రియలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొన్నారు. ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో వున్న కేసీఆర్‌ను గ్రామ కార్యదర్శి సిద్దేశ్వర్ కలిసి వ్యవసాయేతర ఆస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సీఎం స్వయంగా తెలిపిన వివరాలను నమోదు చేసుకున్నారు.

ఎన్లిస్ట్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ ( Enlistment of property)లో భాగంగా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని తన నివాసానికి వచ్చిన పంచాయితీ అధికారులకు తన నివాస గృహా వివరాలను స్వయంగా అందించారు సీఎం. ఎర్రవెల్లి గ్రామ కార్యదర్శి పి. సిద్దేశ్వర్ కేసీఆర్‌ను కలిసి ఆయన నివాస గృహానికి చెందిన వివరాలను ఫోటోతో సహా ప్రత్యేకించిన అప్లికేషన్ TSNPB (Telangana state Non agriculture property book app)లో నమోదు చేశారు.

ఆస్తులపై ప్రజలకు హక్కు, వాటికి భద్రత కల్పించేందుకు ప్రతి కుటుంబ స్థిరాస్తుల వివరాలను నమోదుచేస్తున్నామని ఈసందర్భంగా కేసీఆర్ వివరించారు. గ్రామాలు, పట్టణాలలో ప్రాపర్టీల నమోదు.. దేశంలో మొట్ట మొదటి అతి పెద్ద ప్రయత్నమని సీఎం తెలిపారు. వ్యవసాయ భూముల తరహాలో వ్యవసాయేతర ఆస్తులకు కూడా పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా చేపట్టిన స్థిరాస్తుల నమోదు ప్రక్రియ చర్రితలో మైలురాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. గ్రామీణ, పురపాలక ప్రజలు తమ స్థిరాస్తుల వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపు నిచ్చారు.

Also read:  రాజకీయాల్లోకి విజయ్ దేవరకొండ..! కీలక ప్రకటన చేసిన యాక్టర్

Also read: రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ వార్నింగ్.. అవి ఆపి తీరాల్సిందే!

Also read: బ్రేకింగ్: తెలుగు రాష్ట్రాలకు వాయు‘గండం‘