పుల్వామా బాధితులకు కౌశల్ ఆర్మీ డొనేషన్..!
కౌశల్ మందా.. తెలుగు బిగ్ బాస్ విన్నర్ అయిన దగ్గర నుంచి ఆయన పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అవడానికి కౌశల్ ఆర్మీ ప్రధాన కారణం అని మనకు తెలుసు. ఆయన ఇప్పుడు ఈ ఆర్మీతో కలిపి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నడుపుతున్నాడు. నిన్న కౌశల్ ఆర్మీ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తూ కొవ్వుత్తుల ర్యాలీ జరిగింది. అంతేకాదు ఈరోజు ఉదయం కౌశల్, […]

కౌశల్ మందా.. తెలుగు బిగ్ బాస్ విన్నర్ అయిన దగ్గర నుంచి ఆయన పలు స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. కౌశల్ బిగ్ బాస్ విన్నర్ అవడానికి కౌశల్ ఆర్మీ ప్రధాన కారణం అని మనకు తెలుసు. ఆయన ఇప్పుడు ఈ ఆర్మీతో కలిపి కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ నడుపుతున్నాడు. నిన్న కౌశల్ ఆర్మీ ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు నివాళి అర్పిస్తూ కొవ్వుత్తుల ర్యాలీ జరిగింది.

అంతేకాదు ఈరోజు ఉదయం కౌశల్, అతని భార్యతో కలిసి ఐ.జి ని కలిశారు. కౌశల్ ఆర్మీ ఫౌండేషన్ తరుపున ఐ.జి ఫండ్ కి 50,000 డొనేట్ చేశారు. కౌశల్ చేసిన ఈ పనికి ఐ.జి మెచ్చుకుని ఆయనని ‘యూత్ ఐకాన్’ అని అభివర్ణించారు.




