Congress Corporator: కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణ హత్య.. కాలేజీలో కత్తితో పొడిచి పరార్‌!

కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తెను ఓ యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. నిరంజన్‌ కుమార్తె నేహా (23) చదువుతోన్న బీవీబీ కాలేజీ క్యాంపస్‌లోకి కత్తితో చొరబడిన నిందితుడు ఆమెపై దాడి చేసిపలుమార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి..

Congress Corporator: కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణ హత్య.. కాలేజీలో కత్తితో పొడిచి పరార్‌!
Karnataka Congress Corporator Daughter Murder Case
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 19, 2024 | 9:42 AM

హుబ్బళ్లి, ఏప్రిల్‌ 19: కర్ణాటకలోని హుబ్బళ్లిలో ఘోరం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్‌ నిరంజన్‌ హిరేమఠ్‌ కుమార్తెను ఓ యువకుడు కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. నిరంజన్‌ కుమార్తె నేహా (23) చదువుతోన్న బీవీబీ కాలేజీ క్యాంపస్‌లోకి కత్తితో చొరబడిన నిందితుడు ఆమెపై దాడి చేసిపలుమార్లు కత్తితో పొడిచి హతమార్చాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మృతురాలు నేహా (23) కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ నిరంజన్‌ హిరేమత్‌ కుమార్తె. ఆమె BVB కాలేజీలో మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) ఫస్ట్‌ ఇయర్‌ చదువుతోంది. నిందితుడు ఫయాజ్ (23) కూడా నేహా మాజీ క్లాస్‌మేట్. అతడు అదే కాలేజీలో ఎంసీఏ డ్రాపవుట్‌. బీసీఏ కోర్సు చదువుతున్న సమయంలో వీళ్లిద్దరూ క్లాస్‌మెట్స్‌. కత్తితో క్యాంపస్‌లోకి ప్రవేశించిన ఫయాజ్‌ గురువారం సాయంత్రం 4.45 గంటల సమయంలో నేహాను కత్తితో 6-7 సార్లు విచక్షణారహితంగా దాడి చేసి పారిపోయాడు. ఈ క్రమంలో అతడికి కూడా గాయాలయ్యాయి. దీంతో కాలేజీ సిబ్బంది హుటాహుటీన నేహాను ఆస్పత్రికి తరలించగా అప్పటికే నేహా మృతిచెందినట్లు వైద్యులు దృవీకరించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

బెలగావి జిల్లాకు చెందిన ఫయాజ్, నేహాను ప్రేమించానని, అయితే ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో చాలా రోజులుగా ఈ విషయమై ఆమె వెంటపడుతున్నట్లు తెలిపాడు. అయితే, నిందితుడు చెప్పిన విషయాలు నిజమో.. కాదో.. ధ్రువీకరించుకోవాల్సి ఉందని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ రేణుకా సుకుమార్ అన్నారు. ఫయాజ్‌పై హత్య కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. ‘నేహాను కాలేజీ నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి ఫోన్‌ చేశాను. తనతో మాట్లాడిన ఐదు నిమిషాలకే ఎవరో నేహాను కత్తితో పొడిచారని ఫోన్‌ వచ్చింది. నా కూతురు చనిపోయిందంటే నమ్మలేకపోతున్నాను’ అంటూ నేహ తల్లి గీత కన్నీరు మున్నీరుగా విలపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.