కన్న తల్లిని ఎండలో నిలబెట్టిన కొడుకులు..!

రాను రాను మనిషిలో మానవత్వం మంట కలుస్తోంది. కన్న తల్లి అన్న కనికరం లేని కసాయి బిడ్డలు.. కరోనా సోకిందని దూరం పెట్టారు. కొవిడ్ సాకుతో ఆ తల్లిని ఎర్రటి ఎండలో నిలబెట్టారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. కరోనా సోకిందని నవమాసాలు మోసిన కన్నతల్లినే వదిలించుకోవాలనుకున్నారు ఆ ప్రబుద్ధులు. కరీంనగర్ లోని కిసాన్ నగర్ కి చెందిన మహిళ షోలాపూర్ కి వెళ్లింది. లాక్ డౌన్ కారణంగా ఇంతకాలం అక్కడే ఉండిపోయింది. రాకపోకలపై […]

కన్న తల్లిని ఎండలో నిలబెట్టిన కొడుకులు..!
Follow us

|

Updated on: May 29, 2020 | 6:02 PM

రాను రాను మనిషిలో మానవత్వం మంట కలుస్తోంది. కన్న తల్లి అన్న కనికరం లేని కసాయి బిడ్డలు.. కరోనా సోకిందని దూరం పెట్టారు. కొవిడ్ సాకుతో ఆ తల్లిని ఎర్రటి ఎండలో నిలబెట్టారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ లో చోటుచేసుకుంది. కరోనా సోకిందని నవమాసాలు మోసిన కన్నతల్లినే వదిలించుకోవాలనుకున్నారు ఆ ప్రబుద్ధులు. కరీంనగర్ లోని కిసాన్ నగర్ కి చెందిన మహిళ షోలాపూర్ కి వెళ్లింది. లాక్ డౌన్ కారణంగా ఇంతకాలం అక్కడే ఉండిపోయింది. రాకపోకలపై సడలింపులతో కిసాన్ నగర్ లోని కొడుకు ఇంటికి చేరుకుంది. అయితే, ఆ మాతృమూర్తికి కరోనా సోకిందని కొడుకులు ఇంట్లోకి రానివ్వలేదు. కొవిడ్ బారిన పడ్డ వారిని ఏ బంధుత్వం లేని కరోనా యోధులు కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే.. కన్న కొడుకులే కర్కోటకులుగా మారారు. చేసేది లేక ఆ అమ్మ ఆరుబయట ఎండలో రోడ్డుపైనే కూర్చుంది. ఆ తల్లి దీనస్థితిని చూసిన చుట్టు పక్కల జనం చీవాట్లు పెట్టిన బుద్ధి మారలేదు. దీంతో స్థానిక కార్పొరేటర్ అశోక్ జోక్యంతో ఎట్టకేలకు పెద్ద కొడుకు ఇంట్లోకి వెళ్లింది.