కరోనా సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతిమూక.. టెన్షన్ టెన్షన్..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని కోతులు

  • Tv9 Telugu
  • Publish Date - 6:07 pm, Fri, 29 May 20
కరోనా సాంపిల్స్ ఎత్తుకెళ్లిన కోతిమూక.. టెన్షన్ టెన్షన్..

Coronavirus Test Samples: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ మెడికల్ కాలేజీలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్ని కోతులు కరోనా వైరస్ టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్లిపోయాయి. కరోనా వైరస్ పరీక్షలు జరిపిన తర్వాత ఆ టెస్ట్ కిట్లను ఓ ల్యాబ్ టెక్నీషియన్ తీసుకుని వెళ్తుండగా కోతుల మూక దాడి చేసి ఆ టెస్ట్ కిట్లను ఎత్తుకుపోయింది.

ఈ అనూహ్య ఘటన మీరట్ మెడికల్ కాలేజీ ప్రాంగణంలోనే జరిగింది. ముగ్గురు కరోనా అనుమానితులకు చేసిన టెస్ట్ శాంపిల్స్ అందులో ఉండిపోయాయి. ప్రస్తుతం ఆ శాంపిల్స్ కోతుల వద్ద ఉండడంతో వైద్యులు, వైద్య సిబ్బంది తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఆ కోతి మూక దాడి చేసి కరోనా టెస్ట్ శాంపిల్స్‌ను ఎత్తుకుని వెళ్తున్న దృశ్యాలు కూడా కొన్ని టీవీ చానళ్లలో ప్రసారం అయ్యాయి. అందులో ఓ కోతి శాంపిల్ కిట్‌ను కొరుకుతున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. దీంతో కోతులను పట్టుకోవాలంటూ డాక్టర్లు అటవీ శాఖ అధికారుల సాయం కోరారు.

Also Read: ఏపీలో ఇంటర్ ప్రైవేటు కాలేజీ అడ్మిషన్లకు.. నయా రూల్స్..