కరీంనగర్‌లో మరో మణిహారం.. త్వరలోనే…

కరీంనగర్ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఇక్కడ ప్లాన్ చేస్తోంది. ఇందులోభాగంగా కేబుల్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేస్తోంది. దీంతో కరీంనగర్ కు పర్యాటక శోభ వస్తుందని కరీంనగర్‌ అంచనా వేస్తున్నారు. మానేరు తీరంలోని దిగువ మానేరు జలాశయం వద్ద కొనసాగుతున్న ఈ అద్భుత నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. పర్యాటకులకు తీయని అనుభూతిని పంచేందుకు కరీంనగర్‌- సదాశివపల్లి మధ్య రూ.125.25 కోట్లతో తీగల వంతెనను […]

కరీంనగర్‌లో మరో మణిహారం.. త్వరలోనే...
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 18, 2020 | 6:47 PM

కరీంనగర్ అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను ఇక్కడ ప్లాన్ చేస్తోంది. ఇందులోభాగంగా కేబుల్ బ్రిడ్జ్ ను ఏర్పాటు చేస్తోంది. దీంతో కరీంనగర్ కు పర్యాటక శోభ వస్తుందని కరీంనగర్‌ అంచనా వేస్తున్నారు.

మానేరు తీరంలోని దిగువ మానేరు జలాశయం వద్ద కొనసాగుతున్న ఈ అద్భుత నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. పర్యాటకులకు తీయని అనుభూతిని పంచేందుకు కరీంనగర్‌- సదాశివపల్లి మధ్య రూ.125.25 కోట్లతో తీగల వంతెనను నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే కరీంనగర్‌కు పర్యాటకంగా కొత్త శోభ రానుంది. అయితే ఈ బ్రిడ్జీని దసరా నాటికి ప్రారంభించాలని నిర్ణియించారు.

కరీంనగర్ అల్గునూర్ బ్రిడ్జిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్న దృష్టా వరంగల్‌తో పాటు దక్షిణ భారతదేశానికి కలిపేందుకు ప్రత్యేక రహదారి ఉండాలని సిఎం కేసీఆర్ తీగల వంతెనను ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో మొదట హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి నిర్మించారు. అదే తరహాలో కరీంనగర్ అల్గునూర్ మధ్య ఓ తీగల వంతెనను ఏర్పాటు చేస్తున్నారు.

ఇలాంటి తీగల వంతెన హౌరా, ముంబై కేబుల్ బ్రిడ్జిల తర్వాత సౌత్ ఇండియాలోనే అతిపెద్దది కానుంది. పైన కేబుల్ బ్రిడ్జి, కింద మానేరు రివర్ ఫ్రంట్ నీరు నిలిచి ఉండడంతో పర్యటకులను ప్రత్యేక ఆకర్శనగా నిలువనుంది. ప్రత్యేక రోజుల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను డిస్‌ప్లే చేసే విధంగా డైనమిక్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నారు.