2.5 కోట్ల ఇరానీయులకు కరోనా.. దేశాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..
Rouhani 25 million Iranians infected with COVID-19: ఇరాన్‌లో సుమారు 25 మిలియన్ల ఇరానీయులకు కరోనా సోకిందని ఆ దేశ ప్రెసిడెంట్ హసన్ రౌహనీ వెల్లడించారు. తాజాగా ఆయన కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ప్రస్తుతం ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 25 మిలియన్లకు చేరిందని.. మరో 35 మిలియన్ ఇరానీయులకు కూడా వైరస్ సోకే అవకాశం ఉందని రౌహనీ అంచనా వేశారు. అయితే […]
Rouhani 25 million Iranians infected with COVID-19: ఇరాన్‌లో సుమారు 25 మిలియన్ల ఇరానీయులకు కరోనా సోకిందని ఆ దేశ ప్రెసిడెంట్ హసన్ రౌహనీ వెల్లడించారు. తాజాగా ఆయన కరోనా వైరస్ వ్యాప్తి గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో ప్రస్తుతం ఈ మహమ్మారి బారిన పడ్డవారి సంఖ్య 25 మిలియన్లకు చేరిందని.. మరో 35 మిలియన్ ఇరానీయులకు కూడా వైరస్ సోకే అవకాశం ఉందని రౌహనీ అంచనా వేశారు. అయితే ఆ దేశ ఆరోగ్య శాఖ వెల్లడించిన రిపోర్ట్ కంటే.. రౌహనీ చెప్పిన సంఖ్య మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం.
”మా అంచనా ప్రకారం ఇప్పటివరకు 25 మిలియన్ల ఇరానీయులు కరోనా బారిన పడ్డారు. అంతేకాకుండా సుమారు 14,000 మంది మరణించారు. అలాగే మరో 30 నుండి 35 మిలియన్ల మందికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. ఇక మొత్తంగా 2,00,000 మందికి పైగా ప్రజలు కరోనా కారణంగా ఆసుపత్రి పాలయ్యారు” అని రౌహానీ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. కాగా, వైరస్ వల్ల 13,791 మంది మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ఇక ప్రస్తుతం ఇరాన్‌లో 271,606 పాజిటివ్ కేసులు ఉండగా.. 13,979 వైరస్ కారణంగా మరణించారు. ఇక అక్కడ 235,300 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
Also Read:
వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ వరాలు..
హైదరాబాద్‌లో మద్యం షాపులు బంద్.. కారణమదే..!
సచివాలయాల్లో ఆధార్ సేవలు.. జగన్ సర్కార్ మరో సంచలనం!
సుశాంత్ ఆత్మతో మాట్లాడిన హుఫ్ పారానార్మల్.. షాకిస్తున్న వీడియో..!
జేఈఈ అడ్వాన్స్‌డ్ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..