వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..

Telangana CM KCR Ayush Professors Retirement Age: వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ […]

వారికి వయోపరిమితి పెంపు.. సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్..
Follow us

|

Updated on: Jul 18, 2020 | 12:18 AM

Telangana CM KCR Ayush Professors Retirement Age: వైద్య కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులకు యూజీసీ స్కేల్ అమలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కొత్తగా నియామకమైన నర్సులకు కూడా పాతవారితో సమానంగా వేతనాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆయుష్ విభాగాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వారిలో ఏ ఒక్కరినీ మినహాయించకుండా ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం అందించే పదిశాతం అదనపు వేతనం (కోవిడ్ ఇన్సింటివ్) కొనసాగించాలని సీఎం ఆదేశించారు. పోలీసుశాఖ సిబ్బంది, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్య సిబ్బందికి ఇన్సెంటివ్‌లను కొనసాగించాలన్నారు.

అటు రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 1200 మంది వైద్యులను ప్రభుత్వ సర్వీసులోకి తీసుకోవాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పీ.హెచ్.సీలలో ఖాళీగా ఉన్న 200 మంది డాక్టర్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని తెలిపారు. కరోనా సోకినవారికి అందించే వైద్యంలో భాగంగా వేసే రెమ్‌డెసివర్‌, ఇటోలీజుమ్యాజ్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లను పెద్ద మెత్తంలో సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. అలాగే వీటి అవసరం ఎక్కువ ఉన్నవారికి ఉచితంగానే ఇవ్వాలని తెలిపారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల బెడ్ల అందుబాటు విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ప్రతీ ఆసుపత్రి తమ వద్ద ఎన్ని బెడ్లు ఉన్నాయి? అందులో ఎన్ని ఖాళీగా ఉన్నాయి.? అనే విషయాలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు వివరాలు తెలియజేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

Latest Articles