Breaking: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..

JEE Advanced 2020: విద్యార్ధులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ క్లియరింగ్ అభ్యర్ధులు ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఐఐటీలలో ప్రవేశానికి అర్హత సాధించవచ్చునని జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా పలు ఇంటర్ బోర్డులు పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత నిబంధనల్లో […]

Breaking: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ .. ఇంటర్‌లో 75% మార్కుల నిబంధన తొలిగింపు..
Follow us

|

Updated on: Jul 18, 2020 | 12:57 AM

JEE Advanced 2020: విద్యార్ధులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ క్లియరింగ్ అభ్యర్ధులు ఇంటర్ మార్కులతో సంబంధం లేకుండానే ఐఐటీలలో ప్రవేశానికి అర్హత సాధించవచ్చునని జాయింట్ అడ్మిషన్ బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా పలు ఇంటర్ బోర్డులు పరీక్షలను తాత్కాలికంగా రద్దు చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. వాస్తవానికి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అర్హత నిబంధనల్లో ఇంటర్‌లో 75% మార్కులు తప్పనిసరి అనే రూల్ ఉంది. అయితే ఇప్పుడు ఆ నిబంధనలలో పలు మార్పులు చేసిన జాయింట్ అడ్మిషన్ బోర్డు.. ఇంటర్‌లో కనీస ఉత్తీర్ణతను అర్హతగా నిర్ణయించింది.