కరణం బలరామ్ ! బాలినేని కాళ్ళు పట్టుకో..!!
ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు చేదు అనుభవం మిగిల్చింది. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న అధికార కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యే హోదాలో కరణం బలరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ అనుచరులు కార్యక్రమంలో హంగామా సృష్టించారు. దాంతో ప్రకాశంజిల్లా చీరాలలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. వైయస్‌ఆర్ నేతన్న హస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ గందరగోళం ఏర్పడింది. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి […]
ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమం చీరాల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరామ్‌కు చేదు అనుభవం మిగిల్చింది. మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్న అధికార కార్యక్రమం కావడంతో ఎమ్మెల్యే హోదాలో కరణం బలరామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ నేత ఆమంచి కృష్ణ మోహన్ అనుచరులు కార్యక్రమంలో హంగామా సృష్టించారు. దాంతో ప్రకాశంజిల్లా చీరాలలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది.
వైయస్‌ఆర్ నేతన్న హస్తం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ గందరగోళం ఏర్పడింది. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ నేపధ్యంలో టిడిపికి చెందిన చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి సరసన కూర్చున్నారు. మరోవైపు చీరాల వైసిపి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమంచి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆమంచి జిందాబాద్ అంటూ మంత్రి బాలినేని ఎదుటే హంగామా చేశారు.
2019 ఎన్నికల నుంచి అటు కరణం బలరాం, ఇటు ఆమంచి కృష్ణమోహన్‌ల మధ్య రాజకీయ గొడవలు చెలరేగుతూనే ఉన్నాయి. ఇరువర్గీయులు ఎదురు పడితే ఘర్షణ వాతావరణం నెలకొంటూ వస్తుంది. ఈ నేపధ్యంలో నేతన్న హస్తం కార్యక్రమంలో ఇరువురు నేతలు హాజరు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. వేదికపై మంత్రి బాలినేని పక్కనే ఎమ్మెల్యే కరణం బలరాం, టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత, టీడీపీ మాజీ మంత్రి పాలేటి రామారావుకు కూర్చోవడంతో ఆమంచి వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు.
ఆమంచికి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఆమంచి కృష్ణమోహన్‌ను అధికారులు ఆహ్వానించడంతో వేదికపైకి వెళ్ళిన ఆమంచి మొక్కుబడిగా మంత్రి బాలినేనికి షేక్ హ్యాండిచ్చి తిరిగి వేదిక కిందకు దిగి వచ్చేశారు. వేదిక ఎదురుగా కూర్చున్నారు. దీంతో మంత్రి బాలినేని పలుమార్లు వేదికపైకి రావాల్సిందిగా ఆమంచిని కోరారు. అయితే ఆమంచి మాత్రం వేదిక కిందే కూర్చున్నారు. ఎమ్మెల్యే కరణం బలరాం మాట్లాడుతున్న సమయంలో ఆమంచి జిందాబాద్ అంటూ ఆయన అనుచరులు నినాదాలు చేశారు. మంత్రి బాలినేని కాళ్ళు పట్టుకో అంటూ బలరాంను ఉద్దేశించి ఆమంచి వర్గీయులు హేళన చేశారు.
దీంతో ఇలాంటి చిల్లర రాజకీయాలు తాను చిన్నప్పుడే చూశానని కరణం బలరాం.. ఆమంచి వర్గీయులకు చురకలు అంటించారు.ఇలాంటి చిల్లర రాజకీయాలు చిన్నప్పుడే చూశానని కౌంటర్ ఇచ్చిన బలరాం…అధికారం ఉన్నా లేకున్నా ప్రజా సేవ చేసే విషయంలో ఎలాంటి విభేదాలు ఉండకూడదని హితవు పలికారు. జరిగిన తంతును మౌనంగా గమనించిన మంత్రి బాలినేని ఎవరినీ ఏమీ అనలేక మౌనంగా వుండిపోయారు.