పాక్ స్టాక్ మార్కెట్‌పై ఉగ్రదాడి.. నలుగురు ఉగ్రవాదులు హతం..
పాకిస్థాన్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గత కొద్ది రోజులుగా అక్కడ నిత్యం ఎక్కడో ఓ చోట బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా..
పాకిస్థాన్‌లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గత కొద్ది రోజులుగా అక్కడ నిత్యం ఎక్కడో ఓ చోట బాంబు పేలుళ్లు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. కరాచీలోని స్టాక్ మార్కెట్ బిల్డింగ్ వద్ద ఉగ్రవాదులు గ్రేనేడ్ ఎటాక్ చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు బిల్డింగ్ చుట్టుముట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు స్టాక్ మార్కెట్‌పై దాడికి పాల్పడ్డ నలుగురు ఉగ్రవాదుల్ని కాల్చిచంపేశారు. మరో ఉగ్రవాది బిల్డింగ్ లోపల నక్కిఉండటంతో.. పోలీసులు భవనంలో ఉన్న అందర్నీ బయటకు పంపేస్తున్నారు. ప్రస్తుతం స్టాక్ మార్కెట్ భవనాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.