మరోసారి కేరళ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం.. ప్రయాణికుడు తరలిస్తున్న తీరు చూసి ఖంగుతిన్న అధికారులు..!

విదేశాల నుంచి దేశంలోకి బంగారం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగిస్తున్నారు.

  • Balaraju Goud
  • Publish Date - 10:41 am, Fri, 15 January 21
మరోసారి కేరళ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం.. ప్రయాణికుడు తరలిస్తున్న తీరు చూసి ఖంగుతిన్న అధికారులు..!

International airport Gold seized : అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమార్కులు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. విదేశాల నుంచి దేశంలోకి బంగారం అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగిస్తున్నారు. విభిన్న రూపాల్లో పసిడిని తరలిస్తున్నారు. తాజాగా కేర‌ళ‌లోని క‌న్నూరు ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌ అధికారులు త‌నిఖీలు చేశారు. షార్జా నుంచి ఇండియాకు వ‌చ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 974 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని అత‌న్ని పురీష‌నాళంలో తీసుకువస్తున్నట్లు అధికారులు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 49ల‌క్షలు ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. గోల్డ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ప్రయాణికుడిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Read Also… దిగివచ్చిన హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం.. ఉల్లి, ఆలు ధరలు తగ్గడమే ప్రధాన కారణమంటున్న నిపుణులు