దుర్గగుడిలో 18 నుంచి 25 వరకు చతుర్వేద హోమం, ప్రతి రోజూ గోపూజ, గోవులను సంరక్షించాల్సిన ఆవశ్యకత అందరిపైనా ఉందన్న ఈవో
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 18 నుంచి 25 వరకు చతుర్వేద హోమం నిర్వహిస్తామని దుర్గగుడి ఆలయ ఈవో సురేష్ బాబు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ నెల 18 నుంచి 25 వరకు చతుర్వేద హోమం నిర్వహిస్తామని దుర్గగుడి ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. హోమానికి వేదపండితులకు మాత్రమే ప్రవేశం ఉంటుందన్న ఆయన, భక్తులు వీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పలువురు పీఠాధిపతులు హోమంలో పాల్గొనేందుకు వస్తున్నారని, గోసంరక్షణ, వేద పాఠశాల ట్రస్టులను దేవస్థానం నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. గోవులను సంరక్షించాల్సిన ఆవశ్యకత అందరిపైనా ఉందని, గోవులను రక్షించాలనే సంకల్పంతో ప్రభుత్వం గోపూజను నిర్వహిస్తోందని ఈవో తెలిపారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో దుర్గగుడిలో అభివృద్ది పనులు ప్రారంభించామని, శివాలయం పునర్నిర్మాణం, ప్రాకారం, అన్నదానం భవనం, ప్రసాదం పోటు నిర్మిస్తామన్నారు. ఏడాదిలో పనులు పూర్తి చేసి సీఎం వైఎస్ జగన్ తో ప్రారంభోత్సవాలు చేయిస్తామని దుర్గగుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు.