AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అన్ని రాష్ట్రాలకు చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్.. తెలుగు రాష్ట్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ముగిసింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభించనున్నారు. ఇదిలావుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ..

అన్ని రాష్ట్రాలకు చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్.. తెలుగు రాష్ట్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి
Sanjay Kasula
|

Updated on: Jan 15, 2021 | 10:35 AM

Share

Corona vaccine : దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ముగిసింది. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోది ప్రారంభించనున్నారు. ఇదిలావుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరగనుంది.

గత ఏడాది మార్చిలో కరోనాతో దేశంలో భయం మొదలైంది. జూన్, జులై నాటికి కరోనా  తీవ్ర స్థాయికి చేరుకుంది. మందులేని రోగాన్ని ఎలా నయం చేయాలో తెలియక డాక్టర్లు, దాని బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక ప్రజలు నానా అవస్తలు పడ్డారు. కోవిడ్ సోకకుండా మాస్కులు ధరించడం.. సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు శానిటైజర్లను ఉపయోగించి జాగ్రత్తలు పాటించారు.

అయితే రోగం మన దరికి చేరకుండా కరోనా టీకా ఒక్కటే మార్గమని గుర్తించారు. అమెరికా, ఐరోపాలో కోవిడ్ టీకాల పంపిణీ వేగం పుంజుకుంటున్న తరుణంలోనే బారత్ కూడా సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. టీకా తయారీకి మూడు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. భారీ స్థాయిలో టీకాలు తయారు కావడంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ అన్ని రాష్ట్రాలకు టీకా చేరవేత కార్యక్రమం ముగిసింది.

శనివారం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆన్‌లైన్ ద్వారా వ్యాక్సిన్ ప్రక్రియను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 3,006 ప్రాంతాల్లో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు కానుంది. తొలిరోజు ఒక్కో కేంద్రంలో వంద మందికి వ్యాక్సిన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేట్ హెల్త్ వర్కర్స్, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కొవిన్ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ పరిశీలన జరగనుంది. ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అధికారులు పర్యవేక్షించనున్నారు. నిరంతర ప్రక్రియకు కేంద్రం ప్రత్యేక కాల్‌సెంటర్ ఏర్పాటు చేసింది.

ఇవి కూడా చదవండి :

Jallikattu in Madurai : తమిళనాడులో జోరుగా జల్లికట్టు.. పోటీలో 658 మంది, 790 ఎద్దులు సిద్ధం.. ఇక కుమ్మడే..

Mutton Prices : పండగ పూట మంట పుట్టిస్తున్న మటన్ ధరలు.. కనుమ రోజు భారీగా పెంచేసిన వ్యాపారులు

ఇండోనేషియాలో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.2 గా నమోదు.. ఏడుకు చేరిన మృతుల సంఖ్య

క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే