దిగివచ్చిన హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం.. ఉల్లి, ఆలు ధరలు తగ్గడమే ప్రధాన కారణమంటున్న నిపుణులు

వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది.

దిగివచ్చిన హోల్‌సేల్ ధరల ద్రవ్యోల్బణం.. ఉల్లి, ఆలు ధరలు తగ్గడమే ప్రధాన కారణమంటున్న నిపుణులు
Follow us

|

Updated on: Jan 15, 2021 | 9:55 AM

హోల్‌సేల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) కాస్త దిగివచ్చింది. 2020 డిసెంబర్‌లో ద్రవ్యోల్బణం 1.22 శాతంగా నమోదైంది. ఇది ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమైంది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. టోకు ద్రవ్యోల్బణం.. 2020 నవంబర్​లో 1.55 శాతంగా నమోదు కాగా, 2019 డిసెంబర్​లో 2.76 శాతంగా నమోదైంది. ముఖ్యంగా వంటింటి అవసరాలైన ఉల్లి, ఆలు ధరలు తగ్గడంతో డిసెంబర్‌లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గింది.

ఆహార పదార్థాల డబ్ల్యూపీఐ 2020 నవంబర్‌లో ఇది 1.55% ఉండగా, 2019 డిసెంబర్‌లో 2.76 శాతంగా ఉండేదని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దీంతో 2020 నవంబర్‌లో 4.27 శాతంగా ఉన్న డబ్ల్యూపీఐ ఆహార సూచీ 2020 డిసెంబర్‌లో 4.27 శాతం నుంచి ఏకంగా 0.92 శాతానికి దిగొచ్చింది. పరిశ్రమ, అంతర్గత వాణిజ్యాన్ని పెంచడానికి ఆ విభాగం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఈ విషయాన్ని వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా డిసెంబరులో 4.59 శాతానికి తగ్గింది.

డిసెంబర్‌లో కూరగాయాల హోల్‌సేల్ ధరలు 13.2 శాతానికి తగ్గాయని ప్రభుత్వం తన నివేదికలో వెల్లడించింది. నవంబర్‌లో ఇది 12.24 శాతంగా ఉండేదని పేర్కొంది. నవంబర్‌లో 115.12 శాతంగా ఉన్న బంగాళాదుంపల ద్రవ్యోల్బణం డిసెంబర్‌కు 37.75 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలతో పోలిస్తే వరి, ధాన్యాలు, గోధుమలు, పప్పుల ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్లో మరింత తగ్గింది.

ఆహార ధరల ద్రవ్యోల్బణం కాస్త తగ్గుతుండగా డిసెంబర్లో తయారీ ఉత్పత్తుల ధరలు మాత్రం 4.24 శాతానికి పెరిగాయి. నవంబర్‌లో ఇది 2.97 శాతంగా ఉంది. ఫలితంగా ఆహార వస్తువు, పానీయాలు, వస్త్రాలు, రసాయనాలు, ఔషధాలు, సిమెంటు ధరలు పెరిగాయి. ఇంధనం, విద్యుత్‌ ధరలు సైతం స్వల్పంగా పెరిగాయి.

జనవరి 29నుంచి పార్లమెంట్ సమావేశాలు.. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్

రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
అయినా చిన్న వయసులోనే గుండెపోటు.. ఈ వయస్సులోపు మహిళలకు పెనుముప్పు
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
పరగడుపునే టీ తాగడం అంత ప్రమాదమా ?? నిపుణులేమంటున్నారు ??
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ఓం భీమ్ బుష్‌లో సంపంగి దెయ్యంగా నటించింది ఎవరో తెలుసా..?
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
ప్రభాస్‌ 35లక్షల విరాళం ఇచ్చినట్టుగా ప్రకటించిన డైరెక్టర్‌ మారుతి
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..
మహిళలూ ఇది మీకే.. భర్తలు భార్యల నుంచి కోరుకునేది ఇవేనట..