ఉద్ధవ్ థాకరే, తుజే క్యా లగ్తా హై?.. కంగ‌నా వార్నింగ్

ముంబైలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్‌.. మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కడిగిపడేసింది. శివ‌సేన నేతృత్వంలోని ప్ర‌భుత్వం తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. తన మాటల తూటాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై గురి పెట్టింది. తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ఉద్ధవ్ థాకరే, తుజే క్యా లగ్తా హై?.. కంగ‌నా వార్నింగ్
Follow us

|

Updated on: Sep 09, 2020 | 5:43 PM

ముంబైలోకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ నటి కంగనా రనౌత్‌.. మహారాష్ట్ర ప్రభుత్వ పెద్దలను కడిగిపడేసింది. శివ‌సేన నేతృత్వంలోని ప్ర‌భుత్వం తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. తన మాటల తూటాలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేపై గురి పెట్టింది. తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.

ట్విట‌ర్‌లో వీడియో పోస్ట్ చేస్తూ.. ఏకంగా మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రే పై మాట‌ల దాడి చేసింది. త్వ‌ర‌లోనే తాను సీఎం ఉద్ద‌వ్ థాక్రేపై ప్ర‌త్య‌క్షంగా ప్ర‌తీకారం తీర్చుకుంటాన‌ని హెచ్చ‌రించింది. అయోధ్య‌, క‌శ్మీర్ నేప‌థ్యంలో సినిమాలు తీసి త్వ‌ర‌లోనే థాక్రేకు గుణ‌పాఠం చెప్తాన‌ని చుర‌క‌లంటించారు. ఉద్ధవ్ థాక్రే అంటూ ఏకవచనంతో మండిపడ్డారు.

‘‘నా ఇల్లు కూల్చి ఆనందపడుతున్నారు. నీ అహంకారం కూలే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. కశ్మీర్ పండితుల బాధేంటో నాకు ఈరోజు ఆర్థమైంది’’ అని కంగనా రనౌత్ వ్యాఖ్యానించింది. తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను ట్విట్టర్ షేర్ చేసిన కంగనా బాబర్‌, అతని సైన్యం అంటూ కూల్చివేతకు వచ్చిన సిబ్బందిని ఉద్దేశించి ట్వీట్ చేసింది.

“ఉద్ధవ్ థాకరే, తుజే క్యా లగ్తా హై? ఫిల్మ్ మాఫియాతో పాటు నీవు కలిసిపోయావు, నా ఇంటిని కూల్చివేసి, నాపై ప్రతీకారం తీర్చుకున్నారా? ఈ రోజు నా ఇల్లు కూల్చివేయబడింది, మీ అహంకారం రేపు విరిగిపోతుంది, ఇది సమయం యొక్క చక్రం, గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడూ ఒకేలా ఉండదు,నీవు నాకు సహాయం చేసావు. కాశ్మీరీ పండితులు ఏమి చేశారో నాకు తెలుసు, కాని ఈ రోజు కూడా నేను భావించాను. అయోధ్యపై మాత్రమే కాకుండా కాశ్మీర్‌పై కూడా సినిమా చేస్తానని ఈ దేశానికి ప్రమాణం చేస్తున్నాను,”

ముంబైపై చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో కంగ‌నా‌, శివ‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు మ‌ధ్య వాగ్వాదం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇవాళ కంగ‌నా చండీగ‌ఢ్ నుంచి ముంబైకు చేరుకోగానే శివ‌సేన కార్య‌క‌ర్త‌లు కంగ‌నా గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ముంబై ఆందోళ‌న‌క‌ర వాతావ‌రణం నెల‌కొంది. రానున్న కాలంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.