కమలా హారిస్ పూర్వీకుల గ్రామంలో బాణాసంచా కాల్చి గ్రామస్తుల సంబరాలు, మిఠాయిల పంపిణీ, ఎక్కడో తెలుసా ?

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్ పూర్వీకుల గ్రామం..తమిళనాడులోని తులసేంద్రపురం..

  • Umakanth Rao
  • Publish Date - 7:23 pm, Wed, 20 January 21
కమలా హారిస్ పూర్వీకుల గ్రామంలో బాణాసంచా కాల్చి గ్రామస్తుల సంబరాలు, మిఠాయిల పంపిణీ, ఎక్కడో తెలుసా ?

అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కమలా హారిస్ పూర్వీకుల గ్రామం..తమిళనాడులోని తులసేంద్రపురం లో బుధవారం గ్రామస్థులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. తమ గ్రామానికి చెందిన ఆమె అత్యున్నత అగ్రరాజ్యం ఉపాధ్యక్షురాలి పదవిని పొందారని ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. బాణాసంచా కాల్చారు..స్వీట్స్ పంచుకున్నారు. తులసేంద్రపురం గ్రామమంతా పండుగ ఛాయను సంతరించుకుంది. తాము నేడు ఎంతో గర్విస్తున్నామని వారు పేర్కొన్నారు.  కమలా హారిస్ పూర్వీకులు కొన్నేళ్ల క్రితం ఇదే గ్రామంలో నివసించారు. ఈ విలేజ్ తో వారికీ ఎంతో అనుబంధం ఉంది.