నీలాకాశంలో అద్భుత ఘట్టం.. గురు – శని మహా సంయోగం. ఒక్కటిగా రెండు పెద్ద గ్రహాలు

Balaraju Goud

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2020 | 8:54 PM

ఆకాశంలో తరచూ ఏదో ఓ అద్భుతం జరుగుతుంటుంది. భూమిపై ఉన్న జీవులకు వాటిలో కొన్నింటినే చూసే వీలుంటుంది. అలాంటి అద్భుతమొకటి నేడు ఆవిష్కృతం కాబోతోంది.

నీలాకాశంలో అద్భుత ఘట్టం.. గురు - శని మహా సంయోగం. ఒక్కటిగా రెండు పెద్ద గ్రహాలు

ఆకాశంలో తరచూ ఏదో ఓ అద్భుతం జరుగుతుంటుంది. భూమిపై ఉన్న జీవులకు వాటిలో కొన్నింటినే చూసే వీలుంటుంది. అలాంటి అద్భుతమొకటి నేడు ఆవిష్కృతం కాబోతోంది. సోమవారం రాత్రి ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతమైంది. గురు, శని గ్రహాల కలయిక జరిగింది. . 400 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం అవిష్కృతం కాబోతుంది. గురు – శని మహా సంయోగంతో ఒక్కటిగా కనిపించాయి. మరోవైపు ఈ సంవత్సరంలో అతి పొడవైన రాత్రి వుండే రోజు కూడా ఇవాళే. సూర్యకుటుంబంలో పెద్ద గ్రహమైన గురుడు, చుట్టూ అద్భుతమైన రింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండే శని గ్రహం అత్యంత దగ్గరగా వచ్చాయి. రెండు గ్రహాలు ఒకేచోట చేరి ప్రకాశవంతమైన నక్షత్రాల్లాగా కనువిందు చేశాయి.

దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంది ఈ అద్భుత ఘట్టం. దేశంలో దాదాపు 2 గంటల పాటు ఈ అద్భుతాన్ని వీక్షించే అవకాశం ఉంది. పరిభ్రమణంలో 20 ఏళ్లకోసారి మాత్రమే కాస్త దగ్గరగా వచ్చే గురు, శని గ్రహాలు.. భూమి నుంచి చూస్తే 0.1 డిగ్రీలు ఎడంగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాలు చివరి సారిగా 1623లో అతి దగ్గరగా వచ్చాయి.  ఇలాంటి సంయోగం రాత్రివేళ జరగడం 800 ఏళ్లలో ఇదే మొదటిసారి. మళ్లీ 2080 మార్చి 15న రెండు గ్రహాలు ఈ స్థాయిలో చేరువగా రానున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Dec 2020 08:19 PM (IST)

    ఆకాశంలో మహా అద్భుతం.. గురు, శని గ్రహాల “గొప్ప సంయోగం”

    గురు గ్రహం (జూపిటర్), శని గ్రహం (సాటర్న్) తమ తమ కక్ష్యల్లో ప్రయాణిస్తూ మెల్లగా ఒకదానికి ఒకటి చేరువగా వచ్చాయి.ఈ సాయంత్రం ఈ రెండు గ్రహాలు ఒకదానినొకటి దాటి వెళ్లాయి.రెండు గ్రహాలు ఒక దానినొకటి దాటుతూ, ఒక చోట కలిసిపోయినట్లు కనిపించాయి. రెండు గ్రహాలు ప్రకాశవంతమైన వెలుగులో కనిపించాయి. రెండు గ్రహాలు ఒకే కక్ష్యలో (డబుల్ ప్లానెట్) ఉన్నట్లు కనిపించాయి.

  • 21 Dec 2020 07:34 PM (IST)

    గూగుల్ డూడుల్‌గా ఆకాశంలో అద్భుతం..

    ఆకాశంలో అద్భుతమైన దృశ్యాన్ని తన డూడుల్‌గా పెట్టుకుంది అంతర్జాతీయ దిగ్గజం గూగుల్. ఆకాశంలో గురు, శని గ్రహాల మహాసంయోగం జరుగుతున్న నేపథ్యంలో ఆ వింత డూడుల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు తెగ ముచ్చటపడుతున్నారు.

  • 21 Dec 2020 07:15 PM (IST)

    ‘స్టార్‌ ఆఫ్‌ బెత్లెహేమ్‌’ అవిష్కృతం

    రెండు గ్రహాల కలయికను నేరుగా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఉత్తరార్థగోళంలో జరిగే గ్రహ సముచ్ఛయాన్ని ‘స్టార్‌ ఆఫ్‌ బెత్లెహేమ్‌’గా అభివర్ణిస్తారని తెలిపారు. ఈ సముచ్ఛయం మళ్లీ 2080 మార్చి 15న ఉంటుందని తెలిపారు.

  • 21 Dec 2020 07:11 PM (IST)

    ప్రకాశవంతమైన ఒకే నక్షత్రంగా రెండు గ్రహాలు

    ఆకాశంలో కనిపించనున్న అద్బుత దృశ్యం భూమి మీద నుంచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన ఒకే నక్షత్రంలా కనిపించనున్నాయి. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంటున్న ఈ ఘట్టం.. చరిత్రలో ప్రత్యేకంగా మిగిలిపోనుంది.

  • 21 Dec 2020 07:08 PM (IST)

    గురు, శని గ్రహాల మధ్య “గొప్ప సంయోగం”

    గురు, శని గ్రహాల “గొప్ప సంయోగం” సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల మధ్య కాలంలో కనిపిస్తుంది. ఈ అరుదైన ఖగోళ సంఘటనను DSLR కెమెరాలు లేదా మొబైల్ ఫోన్ కెమెరాను సకాలంలో తీసేట్టు చూసుకోండి. చిత్రాలను తీసేటప్పుడు కెమెరాను స్థిరంగా ఉంచడానికి ట్రైపాడ్ ఉపయోగించండి లేదా చెట్టు, టేబుల్ వంటి వాటికి కెమెరాను అమర్చుకోవడం ద్వారా సరియైన చిత్రాలను తీసుకునేందుకు వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు.

  • 21 Dec 2020 07:03 PM (IST)

    400 మిలియన్ మైళ్ళ దూరంలో అద్బుతం

    సౌర వ్యవస్థలో రెండు అతిపెద్ద గ్రహాలు.. బృహస్పతి, శని గ్రహాలు ఆకాశంలో ఒకే కక్ష్యలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ “గొప్ప సంయోగం” అదృష్టవశాత్తు సంభవిస్తుందంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. ఉత్తర అర్ధగోళంలో ఉన్నవారికి శీతాకాల కాలం, ప్రపంచ దక్షిణాన వేసవి ప్రారంభం. రెండు గ్రహాలు వాస్తవానికి 730 మిలియన్ కిలోమీటర్లు అంటే 400 మిలియన్ మైళ్ళ దూరంలో ఉంటాయంటున్నారు నిపుణులు.

  • 21 Dec 2020 06:50 PM (IST)

    వినీలాకాశంలో గ్రేట్‌ కంజంక్షన్‌..

    మన సౌర వ్యవస్థలోని రెండు అతిపెద్ద గ్రహాలు బృహస్పతి , శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా వస్తున్నాయి. దీని ఫలితంగా గ్రేట్‌ కంజంక్షన్‌ ఏర్పడుతుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఇందుకు సంబంధించి చిత్రాలు, వీడియోలతో నిండిపోయాయి. ఇది ట్విట్టర్‌లో కూడా ట్రెండింగ్‌లో ఉంది.

  • 21 Dec 2020 06:35 PM (IST)

    అరుదైన ఘట్టానికి సమయం అసన్నమైంది

    ప్రతి నెల చంద్రుడు-అంగారకుడు, చంద్రుడు-గురు, చంద్రుడు-శని సహా ఇతర గ్రహాలు దగ్గరగా ఉన్నట్టు కనిపించడం సర్వసాధారణం. చంద్రుడు కాకుండా మిగతా గ్రహాలు కూడా ఒక్కోసారి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. ఇందులో భాగంగానే మనకు గతకొద్ది కాలంగా గురు-శని గ్రహాలు దగ్గరకు వచ్చినట్లు కనిపిస్తున్నాయి.

  • 21 Dec 2020 06:32 PM (IST)

    భూమికి 89 కోట్ల కిలోమీటర్ల దూరంలో గురు గ్రహాం

    అత్యంత సమీపానికి వచ్చినప్పుడు రెండు గ్రహాల మధ్య దూరం దాదాపు 73.5కోట్ల కిలోమీటర్ల ఉంటుంది. ఆ సమయంలో గురు గ్రహం ముందుభాగం భూమికి 89 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్లీ ఈ గ్రహాలు 2080 మార్చి 15న ఈ స్థాయిలో చేరువగా వస్తాయి.

  • 21 Dec 2020 06:31 PM (IST)

    ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహా దృశ్యం

    ఈ ఏడాది ఖగోళ అద్భుతాల పరంపర కొనసాగుతోంది. దాదాపు నాలుగు శతాబ్దాల తర్వాత ఆకాశంలో జరిగే అద్భుతానికి 2020 ఏడాది సాక్షీభూతంగా నిలవనుంది. నేడు డిసెంబరు 21న గురు-శని గ్రహాలు అతి సమీపంగా వచ్చి అత్యంత ప్రకాశవంతంగా కనువిందు చేయనున్నాయి. క్రీ.శ.1623 తర్వాత ఈ రెండు గ్రహాలు ఇంత దగ్గరగా రావడం ఇదే తొలిసారని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. దీంతో ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రపంచమంతా ఆసక్తిచూపుతోంది.

  • 21 Dec 2020 06:30 PM (IST)

    1941 సంవత్సరంలో గురుడు, శని కలిసి వృషభ రాశిలో ప్రవేశం

    గత 100 సంవత్సరాల చరిత్రను గమనిస్తే 1941వ సంవత్సరంలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో గురుడు, శని కలిసి వృషభ రాశిలో సంయోగం చెందారు. ఆ సమయంలోనే జపాన్.. అమెరికాలోని పెరల్ హార్బర్ పై దాడి చేసింది. ఫలింతగా అమెరికా రెండు ప్రపంచ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంది. ఆనతికాలంలోనే అమెరికా విశ్వశక్తిగా అవతరించింది.

  • 21 Dec 2020 06:28 PM (IST)

    రాహు-కేతువుల కలయికతో ప్రపంచంలో పెద్ద మార్పులు..!

    నవంబరు 20న గురుడు.. మకర రాశిలో ప్రవేశించాడు. ఈ సంఘటన తర్వాత శనితో బృహస్పతికి అనుబంధం ఏర్పడింది. ఫలితంగా భారత్ తో పాటు ప్రపంచంలో కూడా పెద్ద మార్పులు సంభవించనున్నాయి. ఈ రెండు పెద్ద గ్రహాలు ఓ రాశిలో కలవడం.. దాదాపు 19 నుంచి 20 ఏళ్ల తర్వాత జరిగింది. ఫలితంగా ప్రపంచంలో పెద్ద మార్పులు జరగనున్నాయని పండితులు చెబుతున్నారు.

  • 21 Dec 2020 06:27 PM (IST)

    గురు గ్రహం చుట్టూ నాలుగు పెద్ద చందమామలు

    నైరుతి, పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రెండు గ్రహాలు రానున్నాయి. గురు గ్రహం ఒకింత పెద్దగా ప్రకాశవంతమైన నక్షత్రంలా దర్శనమిస్తుంది. దానికి ఎడమ భాగంలో.. కొంచెం పైన శని ఒకింత మసకగా కనిపిస్తుంది. రెండింటినీ స్పష్టంగా విడివిడిగా చూడాలంటే బైనాక్యులర్‌ను ఉపయోగించాలి. చిన్నపాటి టెలిస్కోపును వాడితే గురు గ్రహం చుట్టూ ఉన్న నాలుగు పెద్ద చందమామలూ కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు.

  • 21 Dec 2020 06:25 PM (IST)

    నైరుతి, పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాల కలయిక దృశ్యం

    భారత్‌లోని ప్రధాన నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత ఈ మహా కలయికను మామూలు కంటితో చూడొచ్చు. సోమవారం సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 నిమిషాల వరకు నైరుతి, పశ్చిమ దిక్కుల్లో రెండు గ్రహాలు భూమికి దగ్గరగా రావడాన్ని వీక్షించొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • 21 Dec 2020 06:24 PM (IST)

    రెండు గంటలపాటు కనువిందు చేయనున్న మహా అద్బుత దృశ్యం

    ముందుభాగంలో ఉండే గురు గ్రహం.. భూమికి 89 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మళ్లీ ఈ గ్రహాలు 2080 మార్చి 15న ఈ స్థాయిలో చేరువగా వస్తాయి. రెండు గంటలు మహా అద్బుత దృశ్యం కనువిందు చేయనుంది

  • 21 Dec 2020 06:22 PM (IST)

    రెండు గ్రహాల కలయిక.. 800 ఏళ్లలో ఇదే మొదటిసారి

    చివరిసారిగా ఇవి 1623 సంవత్సరంలో ఇంత దగ్గరగా వచ్చాయి. పైగా ఇలాంటి సంయోగం రాత్రివేళ జరగడం.. 800 ఏళ్లలో ఇదే మొదటిసారి. దగ్గరగా వచ్చినా.. తాజా కలయికలో రెండు గ్రహాలు పరస్పరం దగ్గరగా వచ్చినట్లు కనిపించిస్తాయి.

  • 21 Dec 2020 06:20 PM (IST)

    మరి కాసేపట్లో ఆకాశంలో గ్రేట్‌ కంజంక్షన్

    రెండు పెద్ద గ్రహాల కలవడాన్ని గ్రేట్‌ కంజంక్షన్‌గా పేర్కొంటున్నారు శాస్త్రవేత్తలు. ఆ సమయంలో భూమి నుంచి చూస్తున్నప్పుడు.. రెండు గ్రహాలు 0.1 డిగ్రీల మేర మాత్రమే అవి దూరంగా కనిపిస్తాయంటున్నారు. అయితే, వాటి దూరం మాత్రం కోట్లల్లో ఉంటుందంటున్నారు.

  • 21 Dec 2020 06:17 PM (IST)

    మిగతా గ్రహాలకు భిన్నంగా గురుడు, శని కలయిక అరుదైన ఘట్టం

    సౌర కుటుంబంలోనే అతి పెద్దదైన గురు గ్రహం సూర్యుని నుంచి ఐదోది. రెండో అతిపెద్ద గ్రహమైన శని. సూర్యుని నుంచి ఆరోది. మిగతా గ్రహాలకు భిన్నంగా గురుడు, శని కలయిక చాలా అరుదు. సూర్యుని చుట్టూ తిరగడానికి గురుడికి 12 ఏళ్లు పడితే, శనికి 30 ఏళ్లు పడుతుంది. పరిభ్రమణ సమయంలో ప్రతి 20 ఏళ్లకు ఒకసారి ఇవి దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తాయి. అత్యంత దగ్గరగా ఒకే కక్ష్యలో ఉన్నట్లు కనిపించడం మాత్రం అరుదు. ఇది ఇవాళ ఆవిష్కృతం అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • 21 Dec 2020 06:03 PM (IST)

    ఒకటిగా కనిపించే గ్రహాల మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు

    మహా కలయిక భూమి నుంచి చూసినప్పుడు రెండు గ్రహాలు ఆకాశంలో ఒకేచోటుకు వచ్చినట్లు కనిపిస్తే దాన్ని సంయోగంగా పేర్కొంటారు. ఆ సమయంలో అవి సాధారణ దూరం కంటే పరస్పరం దగ్గరగా ఉంటున్నట్లు కనిపిస్తాయి. కానీ వీటి మద్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు.

  • 21 Dec 2020 05:59 PM (IST)

    ప్రకాశవంతమైన ఒకే నక్షత్రంలా కనిపించనున్న రెండు గ్రహాలు

    ఆకాశంలో కనిపించనున్న అద్బుత దృశ్యం భూమి మీద నుంచి చూసినప్పుడు అవి ప్రకాశవంతమైన ఒకే నక్షత్రంలా కనిపించనున్నాయి. దాదాపు 4 శతాబ్దాల తర్వాత చోటుచేసుకుంటున్న ఈ ఘట్టం.. చరిత్రలో ప్రత్యేకంగా మిగిలిపోనుంది.

  • 21 Dec 2020 05:53 PM (IST)

    ఈ సంవత్సరంలో అతి పొడవైన రాత్రి ఇవాళే

    400 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం, గురు – శని గ్రహాలు ఒక్కటిగా కనిపించనున్నాయి. ఈ సంవత్సరంలో అతి పొడవైన రాత్రి వుండే రోజు కూడా ఇవాళే. దేశంలోని చాలా నగరాల్లో సూర్యాస్తమయం తర్వాత గ్రహాలు దగ్గరికొచ్చే దృశ్యం చూడొచ్చు. గురు, శని గ్రహాలు మళ్లీ 2080 మార్చి 15న సమీపంలోకి రానున్నాయి.

  • 21 Dec 2020 05:49 PM (IST)

    397 ఏళ్ల తర్వాత దగ్గరగా వస్తున్న రాహు – కేతులు

    ఇంతకుముందు 1623లో ఈ రెండు గ్రహాలు దగ్గరగా వచ్చాయి. మళ్లీ 397 ఏండ్ల తర్వాత ఈ అద్భుతం జరగబోతోందని ఎంపీ బిర్లా ప్లానెటోరియం డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేవీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెప్పారు. దగ్గరకు వచ్చిన టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వాటి మధ్య దూరం 73.5 కోట్ల కిలోమీటర్లు ఉంటుందని తెలిపారు.

Published On - Dec 21,2020 8:19 PM

Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!