సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. హాజరైన రేణు దేశాయ్, అన్ని దగ్గరుండి చూసుకున్న నితిన్.

గత కొన్నేళ్లుగా ఒంటరి మహిళగా జీవనం సాగిస్తున్న సింగర్ సునీత తాజాగా మరోసారి వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెళ్లి దగ్గరపడుతోన్న నేపథ్యంలో ఆదివారం ఈ జంట ప్రీవెడ్డింగ్ పార్టీని జరుపుకున్నారు.

సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. హాజరైన రేణు దేశాయ్, అన్ని దగ్గరుండి చూసుకున్న నితిన్.
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 21, 2020 | 8:17 PM

singer sunitha pre wedding party: గత కొన్నేళ్లుగా ఒంటరి మహిళగా జీవనం సాగిస్తున్న సింగర్ సునీత తాజాగా మరోసారి వివాహం చేసుకోనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్‌ వీరపనేనితో ఇటీవలే సునీత నిశ్చితార్థం చేసుకున్న విషయం విధితమే. జనవరిలో వీరి వివాహం జరగనుంది. ఇదిలా ఉంటే పెళ్లి దగ్గరపడుతోన్న నేపథ్యంలో ఆదివారం ఈ జంట ప్రీవెడ్డింగ్ పార్టీని జరుపుకున్నారు. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది సన్నిహితులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో సుమ కూడా సందడి చేశారు. ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే యంగ్ హీరో నితిన్ ఈ కార్యక్రమాన్ని మొత్తం దగ్గరుండి చూసుకున్నాడని తెలుస్తోంది. దీనికి కారణం సునీతకు కాబోయే భర్త నితిన్‌కు అత్యంత సన్నిహితుడనే చర్చ జరుగుతోంది.