అదరగొడుతున్న అమేజ్‌ఫిట్ ఇండియా.. మరో స్మార్ట్ వాచ్ రిలీజ్.. దీని స్పెషల్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..
ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ అమేజ్‌ఫిట్ అదరగొడుతోంది. వరుస లాంఛ్‌లతో అందరిని తనవైపునకు తిప్పుకుంటుంది.
ప్రముఖ ఆన్‌లైన్ సంస్థ అమేజ్‌ఫిట్ అదరగొడుతోంది. వరుస లాంఛ్‌లతో అందరిని తనవైపునకు తిప్పుకుంటుంది. కొత్త కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను పరిచయం చేస్తూ యువతను ఆకర్షిస్తోంది. అనువైన ధరలతో, ఆఫర్లతో పిచ్చిక్కిస్తోంది. ఇటీవలే జీటీ 2, జీటీఆర్ 2 స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసిన సంస్థ తాజాగా జీటీఎస్ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు.
జీటీఎస్ 2 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌లో పీఏఐ (పర్సనల్ యాక్టివిటీ ఇంటెలిజెన్స్) సిస్టం ఉంది. దానితో పాటు శరీరంలో బ్లడ్-ఆక్సిజన్ శాతాన్ని తెలుసుకునేందుకు ఆక్సిజన్‌బీట్స్ ఏఐ ఇంజిన్ అమర్చారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 1.65-అంగుళాల చతురస్రాకారపు అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. అమెజాన్ అలెక్సాని ఇది సపోర్ట్ చేస్తుంది. అలానే జీటీఎస్ 2లో స్క్రాచ్-రెసిస్టెంట్ ఫీచర్ ఇస్తున్నారు. ఇందుకోసం వాచ్ డయల్‌కి ఓడీఎల్‌సీ (డైమండ్-లైక్ కార్బన్) పూత పూశారు. అల్వేస్-ఆన్ డిస్‌ప్లే, వాచ్ ఫేస్ కస్టమైజేషన్, హార్ట్‌రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటర్, స్ట్రెస్ మానిటర్, 12 బిల్ట్-ఇన్ స్పోర్ట్స్ మోడ్స్, 5 ఏటీఎం వాటర్-రెసిస్టెంట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇక ఈ వాచ్ ప్రారంభ ధర రూ.12,999. అమేజ్‌ఫిట్ వెబ్‌సైట్ లేదా అమెజాన్ ద్వారా ఈ రోజు నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇందులో పాటలు స్టోర్ చేసుకునేందుకు 3జీబీ మెమొరీ ఇస్తున్నారు. అమేజ్‌ఫిట్ పవర్‌బడ్స్‌ని వాచ్‌తో పెయిర్ చేసిన పాటలు వినొచ్చు. 246 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే వారం రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. పవర్ సేవింగ్ మోడ్‌లో 20 రోజుల పాటు పనిచేస్తుంది.