కాస్టింగ్ కౌచ్: శ్రీరెడ్డి తరహాలో సునీత నిరసన.. అరెస్ట్.. పవన్ పేరు బయటకు..?

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By: Srinu

Updated on: Sep 04, 2019 | 6:11 PM

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనే పదంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ.. సినీ పెద్దలు మాత్రం మౌనం వీడరు. నిజంగానే టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందా..? పెద్ద పెద్ద హీరోయిన్లకు ఆ అనుభవం అయ్యిందా..! కాదని.. వీళ్లంటుంటే.. శ్రీరెడ్డి లాంటి వాళ్లు మాత్రం.. మాకు వాళ్ల హిస్టరీ మొత్తం తెలుసంటున్నారు. కాగా.. సినీ నటి శ్రీరెడ్డి తరహాలోనే మరో జూనియర్ ఆర్టిస్ట్ సునీత నిరసనకు దిగింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగింది సునీత […]

కాస్టింగ్ కౌచ్: శ్రీరెడ్డి తరహాలో సునీత నిరసన.. అరెస్ట్.. పవన్ పేరు బయటకు..?

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ అనే పదంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కానీ.. సినీ పెద్దలు మాత్రం మౌనం వీడరు. నిజంగానే టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ ఉందా..? పెద్ద పెద్ద హీరోయిన్లకు ఆ అనుభవం అయ్యిందా..! కాదని.. వీళ్లంటుంటే.. శ్రీరెడ్డి లాంటి వాళ్లు మాత్రం.. మాకు వాళ్ల హిస్టరీ మొత్తం తెలుసంటున్నారు.

కాగా.. సినీ నటి శ్రీరెడ్డి తరహాలోనే మరో జూనియర్ ఆర్టిస్ట్ సునీత నిరసనకు దిగింది. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగింది సునీత బోయ. తనను తాను గేటుకు నిర్భందించుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. సినిమాల్లో అవకాశం ఇప్పిస్తామని చెప్పి.. తనను వాడుకుని వదిలేశారంటూ.. ఫిల్మ్ ఛాంబర్ ముందు బహిర్గంతంగానే చెప్పింది. తనకి తాను చేతిని.. కాలిని గొలుసులతో నిర్భందించుకుని నిరసనకు దిగింది.

గత ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం.. పనిచేస్తే.. తనకు సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామంటూ.. తనను మభ్యపెట్టి.. మోసం చేశారని.. కానీ.. తీరా చూస్తే.. నేనెవరో తెలీదంటున్నారని వాపోయింది సునీత. జనసేన పార్టీ కోసం పనిచేస్తే.. గీతా ఆర్ట్స్‌లో సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పారని.. అందుకు నేను పార్టీ కోసం.. నా సొంత డబ్బులు ఖర్చు చేశానని చెప్పుకొచ్చింది. తీరా ఎన్నికలు ముగిశాక నిర్మాత బన్నీ వాసు.. నాకేం తెలీదని.. చేతులెత్తేశారని.. చెప్పడంతో ఈ విధంగా నిరసనకు దిగినట్టు తెలిపారు. ఈ విషయంపై.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, గీతా ఆర్ట్స్ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.

ఫిల్మ్ ఛాంబర్ నిర్వాహకులు ఆమెకి ఎంత నచ్చచెప్పినా వినకపోవడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. సునీత ఫేమ్ అవ్వాలనే ఇలాంటి చిల్లర పనులు చేస్తోందని, ఇదివరకు ఒకసారి కూడా ఇలాగే అల్లరి చేస్తే.. తనను మందిలించినట్టు పోలీసులు చెబుతున్నారు.

అయితే.. ఓ గంట క్రితమే ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది. నేను ఫేమ్ కోసం ఇలాంటి పనులు చేయ్యట్లేదని.. జనసేన పార్టీని ఈ గొడవలోకి లాగొద్దని పోస్ట్‌లో తెలిపారు. బయటకి వచ్చిన తర్వాత.. అసలు విషయాలు మీడియాకి చెప్తానని.. దయచేసి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని ఆమె పోస్ట్‌లో తెలిపింది. కానీ.. నిజానికి ఇదంతా.. ఆమె చేస్తోన్న డ్రామానేనా..? లేదా ఎవరైనా కావాలని ఆమెతో చెప్పిస్తున్నారా..? చూడాలి దీనిపై సునీత ఎలా సమాధానమిస్తుందో..!

https://www.facebook.com/sunitha.valmiki.9/posts/2488314301399734

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu