అదిగదిగో చూడండి..నెమలి కన్నుల గణధీశుడు

వినాయక చవితి. అంటేనే వీధులన్ని కోలాహాలంగా మారుతాయి..రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించిన మండపాల్లో అంతే అందంగా ముస్తాబు చేసిన వినూత్న రీతుల్లో భారీ వినాయక విగ్రహలు కొలువుదీరి నవరాత్రులు పూజలందుకుంటాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ఎవరికీ తోచిన విధంగా వారు వినాయక ప్రతిమలు తయారు చేసి తమ భక్తిని చాటుకుంటారు… శ్రీకాకుళం జిల్లాలో  వివిధ రూపాల్లో కొలువు దీరిన విఘ్నేశ్వరుడి మండపాలు, విగ్రహలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. పాలకొండ పెద్ద కాపు వీధిలో […]

అదిగదిగో చూడండి..నెమలి కన్నుల గణధీశుడు
Follow us

|

Updated on: Sep 04, 2019 | 5:41 PM

వినాయక చవితి. అంటేనే వీధులన్ని కోలాహాలంగా మారుతాయి..రంగు రంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించిన మండపాల్లో అంతే అందంగా ముస్తాబు చేసిన వినూత్న రీతుల్లో భారీ వినాయక విగ్రహలు కొలువుదీరి నవరాత్రులు పూజలందుకుంటాయి. పల్లె పట్టణం తేడా లేకుండా ఎవరికీ తోచిన విధంగా వారు వినాయక ప్రతిమలు తయారు చేసి తమ భక్తిని చాటుకుంటారు… శ్రీకాకుళం జిల్లాలో  వివిధ రూపాల్లో కొలువు దీరిన విఘ్నేశ్వరుడి మండపాలు, విగ్రహలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. పాలకొండ పెద్ద కాపు వీధిలో కొలువు దీరిన విఘ్నేశ్వరుడిని చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. పూర్తిగా నెమలి పించాలతో అలంకరించబడిన లంభోదరుడి రూపం అందరినీ ఎంతగానోఆకట్టుకుంటోంది. అయితే, ఈ రూపం వెనక మూడేళ్ల కథే ఉందంటున్నారు ఇక్కడి స్థానికులు. అందేటంటే..మూడున్నర ఏళ్ల క్రితం నిర్వాహకులు ఇక్కడ ప్రతిష్టించే వినాయక విగ్రహానికి సరికొత్త అందాలను పొందు పరచాలన్న ఆలోచన చేశారట. వారి ఆలోచనను అమలు చేసేందుకు గానూ వారు మూడున్నర ఏళ్లుగా నెమలి పించాల సేకరణ మొదలు పెట్టారట. ఇందులో ఉత్సవ కమిటీనిర్వాహకులతో పాటుగా పరిసర ప్రాంతాల ప్రజలను సైతం భాగస్వామ్యం చేసి ఏకంగా 2500 నెమలి పించాలను సేకరించి ఆ మట్టి గణపతికి అతికించి అద్భుత రూపాన్ని ఆవిషృతం చేశారట. మును పెన్నడూ చూడని అపురూపమైన గణపతి విగ్రహాన్ని చూస్తున్నామంటున్న భక్తులు.. అటు ఆనందం, ఇటు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.