రజినీకాంత్‌కు సమన్లు జారీ చేసిన సింగిల్ జడ్జి కమిషన్.. జనవరి 19లోపు సమాధానం ఇవ్వాలని ఆదేశం.
తూత్తుకుడి కేసు విచారణకు సంబంధించి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సింగిల్ జడ్డి కమిషన్ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 19లోపు ఎట్టి పరిస్థితుల్లో సమాధానమివ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
Judicial commission firing summons Rajini: తూత్తుకుడి కేసు విచారణకు సంబంధించి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సింగిల్ జడ్డి కమిషన్ సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 19లోపు ఎట్టి పరిస్థితుల్లో సమాధానమివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 2018 మేలో తూత్తుకడి స్టెరిలైట్ ఫ్యాక్టరీలో ఫైరింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం అప్పట్లో విచారణకు ఆదేశించింది. ఇదిలా ఉంటే ఈ ఘనట జరిగిన సమయంలో రజినీకాంత్ పలు వివాద్పాసద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే ఇప్పుడు రజినీ మెడకు చుట్టుకున్నాయి. ఇంతకీ రజినీ చేసిన వ్యాఖ్యలేంటంటే.. తూత్తుకుడి ఘటన ఉద్దేశపూర్వకంగానే జరిగిందని.. దీని వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని రజినీ సంచలన ఆరోపణలు చేశారు . దీంతో.. ఆయన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్న కమిషన్.. ఘటనకు సంబంధించి రజనీకాంత్ దగ్గరున్న సమాచారం అందించాల్సిందిగా సమన్లు జారీ చేసింది. గతంలోనూ రజనీకాంత్ సమన్లు అందుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా కమిషన్ నోటీసులు పంపింది. కానీ రజనీకాంత్ మాత్రం విచారణకు హాజరు కాలేదు.