మీరు రూమ్ హీటర్ వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే.. లేదంటే అంతే సంగతులు
శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో వెచ్చదనం కోసం రకరకాల వస్తువులు వాడుతుంటాం. అందులో రూం హీటర్ ఒకటి.
శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. దీంతో వెచ్చదనం కోసం రకరకాల వస్తువులు వాడుతుంటాం. అందులో రూం హీటర్ ఒకటి. అయితే దీనిని వాడటం వల్ల గుడ్‌తో పాటు బ్యాడ్ కూడా ఉంది. ముఖ్యంగా చలికి వృద్ధులు, పిల్లలు అసలు తట్టుకోలేరు. వారికోసం చాలా మంది ఈ హీటర్లను వాడుతుంటారు. కానీ ఇది చాలా ప్రమాదం ఎలాగంటే..
రూమ్ హీటర్లు ప్రమాదకరమైన కార్బన్ మోనాక్సైడ్ వాయువును విడుదల చేస్తాయి. ఈ విష వాయువు మన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా చర్మం పొడిబారడం, అలర్జీలు, ఇతర చర్మ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. హీటర్ల వల్ల గాలిలో తేమ తగ్గిపోవడంతో చర్మం పొడిబారటం, ముక్కు లేదా గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి. వీటికి దూరంగా ఉండాలంటే గదిలో ఏర్పడే పొడి గాలిలో తేమ స్థాయిని పెంచాలి. హీటర్లు పెట్టుకొని గదిలో ఉన్నంతసేపు వెచ్చగా, సౌకర్యంగా ఉండవచ్చు. కానీ బయటకు వెళ్లిన తరువాత చలి ప్రభావానికి గురైతే చర్మం తట్టుకోలేదు. కొన్నిసార్లు ఉష్ణోగ్రతలో ఏర్పడే ఇలాంటి హెచ్చుతగ్గులను చర్మం భరించలేదు. ఇది రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తూ అనారోగ్యాలకు కారణమవుతుంది. అందుకే తగినన్ని జాగ్రత్తలు పాటించాలి.