అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్, త్వరలోనే కలుస్తానని ధైర్యం

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులను కలిసి ‘మీకు మేమున్నాం’ అంటూ వారిలో ధైర్యాన్ని నింపిన సినీ తారలు ఎందరో ఉన్నారు. కండరాల బలహీనతతో బాధపడుతున్న వెంకన్న అనే ఓ అభిమానితో తాజాగా వీడియోకాల్‌ మాట్లాడి అతనిలో ధైర్యాన్ని నింపారు హీరో ఎన్టీఆర్‌. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత కలిసి తప్పకుండా సెల్ఫీ ఇస్తానని హామీ ఇవ్వడంతో వెంకన్న ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఎన్టీఆర్‌ను కలవాలనే ఆశతో బతుకుతానని చెప్పడంతో ‘నీకేం కాదు’ అంటూ ఎన్టీఆర్‌ ధైర్యాన్ని నింపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా […]

  • Venkata Narayana
  • Publish Date - 11:53 am, Wed, 4 November 20
అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్, త్వరలోనే కలుస్తానని ధైర్యం

అనారోగ్యంతో బాధపడుతున్న అభిమానులను కలిసి ‘మీకు మేమున్నాం’ అంటూ వారిలో ధైర్యాన్ని నింపిన సినీ తారలు ఎందరో ఉన్నారు. కండరాల బలహీనతతో బాధపడుతున్న వెంకన్న అనే ఓ అభిమానితో తాజాగా వీడియోకాల్‌ మాట్లాడి అతనిలో ధైర్యాన్ని నింపారు హీరో ఎన్టీఆర్‌. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత కలిసి తప్పకుండా సెల్ఫీ ఇస్తానని హామీ ఇవ్వడంతో వెంకన్న ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఎన్టీఆర్‌ను కలవాలనే ఆశతో బతుకుతానని చెప్పడంతో ‘నీకేం కాదు’ అంటూ ఎన్టీఆర్‌ ధైర్యాన్ని నింపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం తీసుకుని అభిమాని వెంకన్నతో ఎన్టీఆర్‌ మాట్లాడారు. దాంతో వెంకన్న ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.