కడుపు నొప్పంటూ వచ్చిన మహిళకు.. ఆ డాక్టర్.?

విపరీతమైన కడుపునొప్పి వచ్చినప్పుడు బాధ తట్టుకోలేక ఏదైనా మందు, లేదా మాత్ర కోసం డాక్టర్ దగ్గరకు వెళ్తాం. సరిగ్గా ఇలాగే ఓ మహిళకు భరించలేని కడుపు నొప్పి వస్తే.. రిలీఫ్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఇక ఆ డాక్టర్ ఆ నొప్పిని పోగొట్టడానికి ఆమెకు చీటిలో రాసిచ్చిన మందును చూసి సదరు మహిళ షాక్ తింది. ఇక డాక్టర్ రాసిచ్చిన దాన్ని మందుల షాప్ వారు ఇవ్వగా.. అది చూసిన మహిళకు కళ్ళు తిరిగినంత పని […]

  • Ravi Kiran
  • Publish Date - 6:51 pm, Mon, 29 July 19
కడుపు నొప్పంటూ వచ్చిన మహిళకు.. ఆ డాక్టర్.?

విపరీతమైన కడుపునొప్పి వచ్చినప్పుడు బాధ తట్టుకోలేక ఏదైనా మందు, లేదా మాత్ర కోసం డాక్టర్ దగ్గరకు వెళ్తాం. సరిగ్గా ఇలాగే ఓ మహిళకు భరించలేని కడుపు నొప్పి వస్తే.. రిలీఫ్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఇక ఆ డాక్టర్ ఆ నొప్పిని పోగొట్టడానికి ఆమెకు చీటిలో రాసిచ్చిన మందును చూసి సదరు మహిళ షాక్ తింది. ఇక డాక్టర్ రాసిచ్చిన దాన్ని మందుల షాప్ వారు ఇవ్వగా.. అది చూసిన మహిళకు కళ్ళు తిరిగినంత పని జరిగింది. ఇంతకీ అదేంటనుకున్నారా.. మందో.. మాత్రో కాదండీ.. అది కండోమ్.

అవునండీ.. మీరు వినేది నిజమే. కడుపునొప్పి అంటూ వచ్చిన మహిళకు ఓ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లో కండోమ్ రాసిచ్చాడు. ఇక ఈ విచిత్రమైన సంఘటన ఝార్ఖండ్‌లో చోటు చేసుకుంది. ఈ ఉదంతంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. జార్ఖండ్ లోని వెస్ట్ సింగ్ భంకు చెందిన క్లాస్ 4 గ్రేడ్ మహిళా ఉద్యోగిని ఒకరు కడుపు నొప్పితో బాధపడుతూ ఘాట్ శిలా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన కాంట్రాక్ట్ వైద్యుడు అష్రాఫ్ బాదర్ మందులుగా కండోమ్స్ రాసిచ్చాడు. మందులు చీటీ తీసుకెళ్లి షాప్‌కు వెళ్లగా.. అక్కడ ఉన్న వారు ఆ చీటీ చూసి నిర్ఘాంతపోయారు.

ఇకపోతే డాక్టర్ చేసిన పనికి తీవ్రంగా ఆగ్రహించిన ఆ మహిళ వెంటనే వైద్యాధికారులకు ఫిర్యాదు చేసింది. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయింది. అటు విపక్ష జార్ఖండ్ ముక్తిమోర్చా సభ్యులు కూడా ఈ విషయాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. ఇక బాధిత మహిళ ఫిర్యాదుపై స్పందించిన వైద్యాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. కాగా ఆ వైద్యుడు ఎందుకిలా చేశాడన్న దానిపై ఇంకా వివరణ రావాల్సి ఉంది.