రంగంలోకి దిగిన జనసేనాని.. మూడ్రోజుల పాటు అమరావతిలోనే..

ఏపీ రాజకీయాల్లో రోజుకో రచ్చ జరుగుతోంది. మొన్న చలో ఆత్మకూరు.. నేడు చలో అమరావతి అంటూ టీడీపీ, జనసేన నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఏపీ జగన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అంతా బాగానే ఉన్నా.. రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కార్ సరైన ప్రకటన చేయకపోవడంతో ప్రజల్లోనూ.. అటు ప్రతిక్షాల్లోనూ సందేహాలు తలెత్తాయి. మరోవైపు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు.. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు. ఈ విషయం పై […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:34 am, Sat, 14 September 19
రంగంలోకి దిగిన జనసేనాని.. మూడ్రోజుల పాటు అమరావతిలోనే..

ఏపీ రాజకీయాల్లో రోజుకో రచ్చ జరుగుతోంది. మొన్న చలో ఆత్మకూరు.. నేడు చలో అమరావతి అంటూ టీడీపీ, జనసేన నేతలు వైఎస్ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఏపీ జగన్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అంతా బాగానే ఉన్నా.. రాజధాని అమరావతి విషయంలో ఏపీ సర్కార్ సరైన ప్రకటన చేయకపోవడంతో ప్రజల్లోనూ.. అటు ప్రతిక్షాల్లోనూ సందేహాలు తలెత్తాయి. మరోవైపు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు.. అమరావతినే రాజధానిగా ఉంచాలని కోరుతున్నారు. ఈ విషయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. రాజధాని పై స్పష్టత, వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు కావడంతో ప్రధానంగా వీటిపై చర్చించేందుకు నేటి నుంచి మూడు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్నారు.

మూడు రోజుల పాటు అమరావతిలో ఉండనున్న పవన్.. వైసీపీ 100 రోజుల పాలనపై తన అభిప్రాయాన్ని చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో బెజవాడకు చెందిన వంగవీటి రాధా జనసేనలో చేరతారని తెలుస్తోంది. రాజధానిగా అమరావతే ఉండాలంటున్న పవన్.. అవసరమైతే ఈ విషయంలో రైతులు, ప్రజల తరపున దీక్ష చేపడతానని ప్రకటించనున్నట్లు సమాచారం.

మరోవైపు యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని కూడా పవన్ వ్యతిరేకిస్తున్నారు. నల్లమల అడవుల్లోని అమ్రాబాద్ ప్రాంతంలో.. యురేనియం కోసం తవ్వకాలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. తవ్వకాల వల్ల పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పోరాడుతున్నాయి. అయితే ఈ విషయంలో నల్లమల పరిరక్షణ కోసం జనసేన మద్దతుగా నిలుస్తుందని పవన్ ప్రకటించారు.