ఆధ్యాత్మికపరులైన రజనీకాంత్ గారికి భగవదనుగ్రహం కలగాలి, మహావతార్ బాబాజీ ఆశీస్సులతో కోలుకోవాలి : పవన్
ప్రముఖ కథానాయకులు, ఆధ్యాత్మికపరులైన శ్రీ రజనీకాంత్ గారికి భగవదనుగ్రహం కలగాలని, ఆయన త్వరగా కోలుకోవాలని...
ప్రముఖ కథానాయకులు, ఆధ్యాత్మికపరులైన శ్రీ రజనీకాంత్ గారికి భగవదనుగ్రహం కలగాలని, ఆయన త్వరగా కోలుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. రజనీకాంత్ ఎంతగానో విశ్వసించే మహావతార్ బాబాజీ ఆశీస్సులతో, సంపూర్ణ ఆరోగ్యంతో ఆయన మన ముందుకు రావాలని కోరుకొంటున్నానని పవన్ పేర్కొన్నారు. ఆయనకు కరోనా లక్షణాలు లేవని వైద్యులు ప్రకటించడం ఊరటనిచ్చిందని పవన్ తెలిపారు. మనోధైర్యం మెండుగా ఉన్న శ్రీ రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. అని పవన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.