ఏపీలో లిక్కర్ షాపుల దగ్గర టీచర్లకు విధులు…!

ఏపీలో లిక్కర్ షాపుల దగ్గర టీచర్లకు విధులు...!

ఏపీలో మద్యం అమ్మకాలు పునః ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 40 రోజుల తర్వాత విక్రయాలు మొదలు కావడంతో మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు. మొద‌టిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇదంతా పక్కన పెడితే.. లిక్కర్ షాపుల దగ్గర టీచర్లకు డ్యూటీలు వేయడంతో.. స‌ర్కార్ తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విశాఖ జిల్లాతో పాటూ ప‌లు చోట్ల టీచ‌ర్స్ మొదటి రోజు విధులకు హాజరయ్యారు. కొంతమంది టీచర్లు ఇబ్బందిక‌రంగానే వైన్ షాపుల వ‌ద్ద‌కు వెళ్లామని.. […]

Ram Naramaneni

|

May 05, 2020 | 4:11 PM

ఏపీలో మద్యం అమ్మకాలు పునః ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 40 రోజుల తర్వాత విక్రయాలు మొదలు కావడంతో మందుబాబులు షాపుల ముందు క్యూ కట్టారు. మొద‌టిరోజే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఇదంతా పక్కన పెడితే.. లిక్కర్ షాపుల దగ్గర టీచర్లకు డ్యూటీలు వేయడంతో.. స‌ర్కార్ తీరుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. విశాఖ జిల్లాతో పాటూ ప‌లు చోట్ల టీచ‌ర్స్ మొదటి రోజు విధులకు హాజరయ్యారు. కొంతమంది టీచర్లు ఇబ్బందిక‌రంగానే వైన్ షాపుల వ‌ద్ద‌కు వెళ్లామని.. తమకు విధుల నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలతో పాటు సోష‌ల్ మీడియ‌లో కూడా ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు మొద‌ల‌య్యాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పే గురువులతో ఇలాంటి పనులు చేయిస్తారా అంటూ నెటిజన్లు మండిప‌డుతున్నారు.

దీనిపై సోషల్ మీడియాలో తీవ్ర‌స్థాయిలో చర్చే నడుస్తోంది.. అసలు ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యను పరిష్కరించేలా చేయాలని కోరుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీ నుంచి సోమిరెడ్డితో పాటు..జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఏపీ ప్ర‌భుత్వ చ‌ర్య‌ను తీవ్రంగా ఖండించారు. ఇప్పటికే కొంతమంది డీఈవోకు కంప్లైంట్స్ చేసినట్లు తెలుస్తోంది. పీఆర్టీయూ నేతలు, మరికొంతమంది ఉపాధ్యాయ సంఘాలు… ఆర్డీవో, ఏఎస్పీకి ఫిర్యాదు చేశార‌ని స‌మాచారం. లాక్‌డౌన్ డ్యూటీలు వేస్తే సరే కాని.. ఇలా మద్యం షాపుల దగ్గరకు వెళ్లమనడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ వ్యవహారంపై స‌ర్కార్ ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu