AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగార్జునసాగర్‌లో పొలిటికల్ హీట్.. బీజేపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం.. స్పందించిన జానారెడ్డి.. పార్టీ మార్పుపై క్లారిటీ..

తాను పార్టీ మారబోతున్నానని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కూందురు జనారెడ్డి స్పందించారు.

నాగార్జునసాగర్‌లో పొలిటికల్ హీట్.. బీజేపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం.. స్పందించిన జానారెడ్డి.. పార్టీ మార్పుపై క్లారిటీ..
Shiva Prajapati
|

Updated on: Dec 09, 2020 | 11:30 PM

Share

తాను పార్టీ మారబోతున్నానని వస్తున్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కూందురు జనారెడ్డి స్పందించారు. తాను ఏ పార్టీలోకి వెళ్లబోనని స్పష్టం చేశారు. పార్టీ మార్పునకు సంబంధించి తనను ఏ పార్టీ సంప్రదించలేదన్నారు. పార్టీ మార్పు విషయంలో తనలాంటి సీనియర్ నాయకుడిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు జానారెడ్డి. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన కొడుకు, తాను బీజేపీలో చేరబోతున్నారని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఇదే సమయంలో నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక పైనా స్పందించారు. ఇక్కడ ఎవరు పోటీ చేయాలనే అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని జానారెడ్డి పేర్కొన్నారు. అలాగే పీసీసీ అధ్యక్ష ఎన్నికపైనా అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. పీసీసీ ఎంపీకకు సంబంధించి తన అభిప్రాయం తాను ఏఐసీసీ కోర్ కమిటీకి తెలిపానని జానారెడ్డి చెప్పారు.

కాగా, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీరారెడ్డి బీజేపీలో చేరబోతున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా వారు బీజేపీలోకి చేరుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, నాగార్జున సాగర్ నియోజకర్గం ఎమ్మెల్యే నోముల సర్సింహయ్య ఇటీవల గుండెపోటు కారణంగా హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబట్టిన బీజేపీ నాగార్జునసాగర్‌లో నూ పాగా వేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి ప్రణాళికలను ఇప్పటి నుంచే రచిస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి, ఆయన తనయుడు రఘువీరారెడ్డిని తమ పార్టీలోకి లాగడంపై బీజేపీ నేతలు ఫోకస్ పెట్టారు.