Jagan on Divena program: ఏపీలో జగనన్న దీవెన.. సీఎం కీలక వ్యాఖ్యలు

ఏపీలోని పేద విద్యార్థులకు చేయూతనందించేందుకు ఉద్దేశించిన జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి ముఖ్యమంత్రి సోమవారం శ్రీకారం చుట్టారు. విజయనగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారంతో తమ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Jagan on Divena program: ఏపీలో జగనన్న దీవెన.. సీఎం కీలక వ్యాఖ్యలు
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 24, 2020 | 2:21 PM

AP CM crucial comments on Jagananna divena: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్రంలోని పేద విద్యార్థులకు సౌకర్యం కోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. జగనన్న దీవెన కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ కీలక కామెంట్లు చేశారు. ఒకే ఇంట్లో ఎంతమంది చదువుకున్నా అందరికి జగనన్న వసతి దీవెన వర్తిస్తుందని వెల్లడించారు. వసతి దీవెన కోసం ప్రతి ఏటా 2,300 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించారు.

సోమవారం తొలిరోజే ఈ పథకం కింద 1,100 కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లి అక్కౌంట్‌కు బదిలీ చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వంపై విమర్శలు చేసున్న వారిని పట్టించుకోకండంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోవాలని విపక్ష టీడీపీ పత్రికల సాయంతో కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ ఆరోపించారు.

మూడు ప్రాంతాల్లో సమన్యాయం చేయొద్దని మూకలు దాడులు చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. పేదల పట్టాల విషయంలో కూడా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ దామాషాను పెంచే పద్ధతిని కూడా వ్యతిరేకిస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయక పోయినా ఏదో తప్పు జరిగిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

Read this: Petition filed against Chandrababu చంద్రబాబుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్