ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.. మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Jagadish Reddy comments on Etela Rajender: తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ ప్రయాణం గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన ఏ పార్టీలోకి
Jagadish Reddy comments on Etela Rajender: తెలంగాణలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ ప్రయాణం గురించి సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఆయన ఏ పార్టీలోకి వెళతారు.. ఆ తర్వాత ఆయన భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది.. అనే పలు విషయాలపై చర్చ కొనసాగుతోంది. కొన్ని రోజుల నుంచి ఈటల రాజేందర్ బీజేపీలోకి చేరుతారని ప్రచారం కొనసాగుతోంది. బీజేపీలోకి ఈటల చేరడం ఖాయమని పలువురు రాజకీయ నేతలు సైతం పేర్కొంటున్నారు. ఢిల్లీ హైకమాండ్ సైతం ఈటల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతున్నారన్న విషయంపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి శుక్రవారం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్తే ప్రయోజనం ఉండకపోవచ్చని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆయన వల్ల టీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉండదని పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభ తగ్గుతోందని.. బీజేపీని నమ్ముకున్న వారికి ఒరిగేదీ ఏమీ ఉండదని వ్యాఖ్యానించారు. అయినా.. బీజేపీకి తెలంగాణలో బలం లేదంటూ పేర్కొన్నారు. రాజకీయ పార్టీల్లో అనుకున్న స్థానం దక్కని వాళ్లు… ఒక పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్లడం సహజమంటూ.. జగదీశ్ రెడ్డి పరోక్షంగా ఈటలను ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండకపోవచ్చంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: