AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IT Returns: ఐటీ రిటర్న్స్ పోర్టల్ సమస్యలు పరిష్కారం.. రెండుకోట్లకు పైగా రిటర్న్స్ దాఖలు.. వెల్లడించిన సీబీడీటీ!

ఇప్పటివరకు రెండు కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు అయ్యాయి. కొత్త ఐటి పోర్టల్ పనితీరుకి సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.

IT Returns: ఐటీ రిటర్న్స్ పోర్టల్ సమస్యలు పరిష్కారం.. రెండుకోట్లకు పైగా రిటర్న్స్ దాఖలు.. వెల్లడించిన సీబీడీటీ!
It Returns
KVD Varma
|

Updated on: Oct 15, 2021 | 10:31 AM

Share

IT Returns: ఇప్పటివరకు రెండు కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటిఆర్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాఖలు అయ్యాయి. కొత్త ఐటి పోర్టల్ పనితీరుకి సంబంధించిన సమస్యలు చాలా వరకు పరిష్కారం అయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ప్రత్యక్ష పన్నుల సెంట్రల్ బోర్డ్ (CBDT) పన్ను చెల్లింపుదారులకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి (ఏప్రిల్ 2020-మార్చి 2021) ఆదాయపు పన్ను రిటర్నులను త్వరగా దాఖలు చేయాలని విజ్ఞప్తి చేసింది. అన్ని ITR లు ఇ-ఫైలింగ్ కోసం అందుబాటులో ఉన్నాయని వివరించింది.

సీబీడీటీ(CBDT) ఒక ప్రకటనలో, “2021-22 ఆర్థిక సంవత్సరానికి, రెండు కోట్ల కంటే ఎక్కువ ఐటిఆర్ లు పోర్టల్‌లో దాఖలు అయ్యాయి. వీటిలో ఐటిఆర్1 అలాగే ఐటిఆర్ 4 ఖాతాలు 86 శాతం ఉన్నాయి. 1.70 కోట్లకు పైగా రిటర్న్స్ ఇ-వెరిఫై చేయడం జరిగింది. అందులో 1.49 కోట్ల రిటర్న్స్ ఆధార్ కార్డ్ ఆధారిత ఒటీపీ ద్వారా జరిగాయి. ఆధార్ కార్డుకు సంబంధించిన ఒటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్), ఇతర పద్ధతుల ద్వారా ఇ-ధృవీకరణ ప్రక్రియ విషయంలో డిపార్ట్‌మెంట్ ఐటిఆర్ ప్రక్రియను ప్రారంభించి, రీఫండ్ జారీ చేయడం కోసం అవసరమైన ప్రక్రియ.

ఈ అంచనా సంవత్సరంలో 36.22 లక్షల రీఫండ్‌లు జారీ..

ధృవీకరించబడిన ఐటిఆర్ 1, ఐటిఆర్ 4 లలో, 1.06 కోట్లకు పైగా ఐటిఆర్ లు ప్రాసెస్ చేయడం జరిగింది. 2021-22 అంచనా సంవత్సరానికి 36.22 లక్షలకు పైగా రీఫండ్‌లు జారీ అయ్యాయి. ఐటిఆర్ 2, 3 ప్రాసెసింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.

కొత్త పోర్టల్ జూన్ 7 న ప్రారంభామైంది..

ఈ సంవత్సరం జూన్ 7 న కొత్త పోర్టల్ ప్రారంభించారు. ప్రారంభ కాలంలో, పన్ను చెల్లింపుదారులు పోర్టల్ పనితీరులో అక్రమాలు, ఇబ్బందులనుఎదుర్కున్నారు. సీబీడీటీ (CBDT) “అనేక సాంకేతిక సమస్యలు పరిష్కరించడం జరిగింది అదేవిధంగా పోర్టల్ పనితీరు ఇప్పుడు చాలా వరకు స్థిరీకరణమైంది” అని వెల్లడించింది.

55 లక్షల పన్ను చెల్లింపుదారులు మళ్లీ పాస్‌వర్డ్ అందుకున్నారు..

అక్టోబర్ 13 వరకు, 13.44 కోట్ల మందికి పైగా పన్ను చెల్లింపుదారులు ‘లాగిన్’ అయ్యారని, దాదాపు 54.70 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తమ పాస్‌వర్డ్‌లను తిరిగి పొందే సదుపాయాన్ని పొందారని సీబీడీటీ పేర్కొంది.

Also Read: Dussehra 2021: పాల పిట్ట దర్శనంతో ముగిసే దసరా ఉత్సవాలు.. ఎందుకు దర్శిస్తారంటే..

Mysore Palace: అంగరంగ వైభవంగా మైసూర్‌ దసరా ఉత్సవాలు.. విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతున్న ప్యాలెస్‌