‘పోయి.. మీ పని చూస్కోండి’.. బీజేపీ నేతలకు సేతుపతి వార్నింగ్…

IT Raids On Vijay: దళపతి విజయ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించడం తమిళనాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు రెండు రోజుల పాటు ఈ రైడ్స్ జరగగా.. భారీ మొత్తంలో నగదు, వజ్రాలు, బంగారం దొరికినట్లు వార్తలు వచ్చాయి. ‘బిగిల్’ సినిమా లెక్కల విషయంలో నిర్మాత, ఫైనాన్షియర్, హీరో విజయ్ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ దాడులు చేశారు. అయితే దళపతి దగ్గర నుంచి మాత్రం ఎటువంటి డాక్యుమెంట్స్ లభించలేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే […]

'పోయి.. మీ పని చూస్కోండి'.. బీజేపీ నేతలకు సేతుపతి వార్నింగ్...
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 13, 2020 | 2:44 PM

IT Raids On Vijay: దళపతి విజయ్ ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించడం తమిళనాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు రెండు రోజుల పాటు ఈ రైడ్స్ జరగగా.. భారీ మొత్తంలో నగదు, వజ్రాలు, బంగారం దొరికినట్లు వార్తలు వచ్చాయి. ‘బిగిల్’ సినిమా లెక్కల విషయంలో నిర్మాత, ఫైనాన్షియర్, హీరో విజయ్ ఇళ్లపై ఆదాయపన్ను శాఖ దాడులు చేశారు. అయితే దళపతి దగ్గర నుంచి మాత్రం ఎటువంటి డాక్యుమెంట్స్ లభించలేదని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సోదాలకు తాజాగా రాజకీయ రంగు పులుముకున్న విషయం విదితమే. విజయ్‌ను బీజేపీ టార్గెట్ చేసి ఇదంతా చేయిస్తోందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో అతడు నటించిన ‘మెర్సల్’ అనే చిత్రంలో ఉచిత వైద్యం, జీఎస్టీ వంటి అంశాలపై కాషాయ పార్టీని టార్గెట్ చేశాడు. అప్పట్లో దీన్ని బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా బిగిల్ ఆడియో ఫంక్షన్‌లో అన్నాడీఎంకే నాయకులకు దళపతి ఇన్‌డైరెక్ట్ వార్నింగ్‌ కూడా ఇచ్చాడు. ఈ పరిణామాల వల్లే విజయ్‌పై ఐటీ రైడ్స్ జరిగాయంటూ కొంతమంది నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు.

ఇటీవల స్టార్ హీరో అజిత్ కుమార్ విజయ్‌కు అండగా నిలుస్తూ కౌంటర్ ఎటాక్ చేయగా.. ఇప్పుడు అదే కోవలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి దళపతికి సపోర్ట్‌గా నిలిచారు. ఆయన తాజాగా చేసిన ట్వీట్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘విజయ్‌పై జరిగిన ఐటీ రైడ్స్ వెనుక అసలు నిజాలు ఇవేనంటూ ఓ జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ను జత చేస్తూ ఆయన ఇచ్చిన కౌంటర్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది.

‘జెప్పియార్ కూతురు రెజీనా తమిళనాడులో పెద్ద క్రైస్తవ మత పోరాటం చేస్తోంది. విజయ్ సేతుపతి, ఆర్య, రమేష్ కన్నా తదితరులు ఓ మీటింగ్‌లో ఆ మతంలోకి మారారు. అంతేకాకుండా ఏజీఎస్ సంస్థ పేరిట ‘బిగిల్’ సినిమాకు రెజీనానే డబ్బులు అంతా సమకూర్చిందని..  ఈ తతంగం అంతా మంత్రిత్వ శాఖ గమనిస్తూనే ఉందంటూ’ ఆ ట్వీట్‌లో పేర్కోగా.. దానికి విజయ్ సేతుపతి ‘మీకు ఉద్యోగం ఏమి లేదా.. పోయి పని చూసుకోండి’ అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు.