Made In India Platform ‘Koo’: ట్విట్టర్‌పై చర్యలకు కేంద్రం సన్నాహాలు.. ‘దేశీ ట్విటర్ ‘కూ’ వైపు అడుగులు..
ట్విటర్ వ్యవహారంపై సీరియస్ అవుతున్న కేంద్రం ఇక 'దేశీ ట్విటర్ 'కూ' పైకూడా దృష్టి పెట్టింది. మేడిన్ ఇండియా ట్విటర్ అయిన ఈ ప్లాట్ ఫామ్ కూడా ట్విటర్ దారిలోనే సాగుతున్నట్టు ఎలక్ట్రానిక్స్,
Made In India Platform ‘Koo’: ట్విటర్ వ్యవహారంపై సీరియస్ అవుతున్న కేంద్రం ఇక ‘దేశీ ట్విటర్’ ‘కూ’ వైపు అడుగులు వేస్తోంది. మేడిన్ ఇండియా ట్విటర్ అయిన ఈ ప్లాట్ ఫామ్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దీనికి అనుబంధంగా ఉన్న మరిన్ని సంస్థలు తమ సోషల్ మీడియా ఖాతాలను మార్చుకున్నాయి. ఓ రిపోర్టు ప్రకారం.. ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖతో బాటు డిజిటల్ ఇండియా, ఇండియా పోస్ట్, ఎన్ఐసీ, సమీర్, కామన్ సర్వీసెస్ సెంటర్, ఉమంగ్ యాప్ డీజీ లాసర్ తదితర సంస్థలకు చెందిన అకౌంట్లను వెరిఫై చేసిన తర్వాత ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా ‘కూ’ను తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది. ఖలిస్తానీ, భారత వ్యతిరేక పోస్టులను తొలగించాలన్న తమ ఉత్తర్వులను పాటించడంలో విఫలమైన ట్విటర్ పై చర్య తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో ‘కూ’పై కేంద్రం ఫోకస్ చేయడం గమనార్హం. ఖలిస్తానీ సానుభూతిపరులు, లేదా పాకిస్థాన్ మద్దతుదారులు లేక విదేశాల నుంచి పోస్టులు పెడుతున్నవారి ట్విట్టర్ ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించింది.
వీటిలో చాలా అకౌంట్లు ఆటోమేటెడ్ బోట్స్ కూడా..రైతుల నిరసనలపై ఇవి తప్పుడు లేదా, రెచ్చగొట్టే, సమాచారాన్ని, కంటెంట్స్ ను ఇస్తున్నాయి అని ప్రభుత్వం భావిస్తోంది. భారత వ్యతిరేక పోస్టులను సమర్థిస్తూ ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే చేసిన వ్యాఖ్యలను కూడా ప్రభుత్వ వర్గాలు పరిగణనలోకి తీసుకున్నాయి. రైతుల ఆందోళనలపై విదేశీ సెలబ్రిటీలు పెట్టిన పలు పోస్టులకు ఆయన మద్దతు ప్రకటించారు. పాప్ సింగర్ రిహానా ట్వీట్స్ ను ఆయన లైక్ చేశారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను ఇండియాలో ట్విటర్ ఏ కోర్టులోనూ ఇంకా సవాలు చేయలేదు. వీటిని సవాల్ చేస్తూ ఏ సంస్థ అయినా కోర్టులో అప్పీలు చేసుకోవచ్ఛునని అంటున్నారు.
మరిన్ని వార్తల కొరకు : జాతీయం
మరిన్ని వార్తలు: నాపై అవిశ్వాస తీర్మానం పెడతారా ? నో ప్రాబ్లమ్ ! రాజ్యసభలో చైర్మన్ వెంకయ్యనాయుడు మనస్తాపం