నాడు బాబు అందించిన ప్రోత్సాహమే.. నేడు సిందూ సక్సెస్‌కి కారణం : లోకేష్ ట్వీట్

స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విజన్ ఉందని ఎమ్మెల్సీ నారాలోకేష్ అన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆమెలాంటి క్రీడాకారిణుల వెనుక చంద్రబాబు విజన్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో క్రీడాకారులు గోపిచంద్‌కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహరించారని అన్నారు. ఇప్పుడా […]

  • Tv9 Telugu
  • Publish Date - 5:01 pm, Thu, 29 August 19
నాడు బాబు అందించిన ప్రోత్సాహమే.. నేడు సిందూ సక్సెస్‌కి కారణం : లోకేష్ ట్వీట్

స్టార్ షట్లర్ పీవీ సింధు విజయం వెనుక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు విజన్ ఉందని ఎమ్మెల్సీ నారాలోకేష్ అన్నారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఆమెలాంటి క్రీడాకారిణుల వెనుక చంద్రబాబు విజన్ ఉందని లోకేష్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో క్రీడాకారులు గోపిచంద్‌కు ఐదెకరాల స్థలం ఇచ్చి బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు సహరించారని అన్నారు. ఇప్పుడా అకాడమీ పీవీ సింధులాంటి క్రీడా ఆణిముత్యాలను దేశానికి అందిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.

అంతేకాదు, జాతీయ క్రీడా దినోత్సవం రోజుల వైసీపీ నేతల క్రీడా పరిజ్ఞానాన్ని అభినందిద్దాం అంటూ.. విశాఖలో టెన్నీస్ స్టార్ సానియా మిర్జా ఫోటో కింద మాజీ అథ్లెట్ పీటీ ఉష పేరు ఉన్న ఫ్లెక్సీని కూడా పోస్టు చేశారు. సానియా మిర్జా ఎవరో, పీటీ ఉష ఎవరో తెలియని దురావస్థలో వైసీపీ నేతలు ఉన్నారని ఆయన విమర్శించారు.