Mahesh Babu : మహేష్ తో సినిమాకు సిద్దమైన నితిన్ దర్శకుడు.. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసిన వెంకీ కుడుములు.?
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమా చేస్తున్న విషయం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది.
Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్న విషయం. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది తెలుస్తుంది. ఈ సినిమాలో మహేష్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండనుంది. ఈ సినిమా తర్వాత మహేష్ వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడు. అయితే వరుసగా ఛలో, భీష్మ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న వెంకీ కుడుములు మహేష్ తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
వెంకీ కుడుములు మహేష్ కు స్టోరీ లైన్ వినిపించాడని.. బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేయమని మహేష్ చెప్పాడని గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఫిలిం నగర్లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం వెంకీ స్క్రిప్ట్ రెడీ చేసేసాడట. మహేష్ కు త్వరలోనే స్టోరీని వినిపించావుతున్నాడట. కథ నచ్చి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పరశురామ్, వంశీ పైడిపల్లి సినిమా తర్వాత వెంకీ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే మహేష్ తో సినిమా చేయడానికి ఓ వైపు స్టార్ డైరెక్టర్స్ కుడా సిద్ధంగా ఉన్నారు. మహేష్ కూడా వరుసగా కథలను వింటుంన్నాడు. ఇంత పోటీలో వెంకీకి ఆఫర్ దక్కుతుందా.? అన్నది తెలియాల్సి ఉంది.
also read : Satyadev New movie : మరో సినిమాను అనౌన్స్ చేసిన యంగ్ హీరో.. ఈ సారి ‘గాడ్సే’గా రానున్న సత్యదేవ్