ఆఫ్ఘన్ గురుద్వారా దాడికి కేరళకు లింక్.. ఆ సూసైడ్ బాంబర్ ఎవరంటే..?

గత రెండు మూడు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని సిక్కు మతస్థులకు చెందిన గురుద్వారాపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా.. మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ గురుద్వారాపై దాడి చేసింది మొత్తం నలుగురు ఉగ్రవాదులని అక్కడి పోలీస్‌ అధికారులు గుర్తించారు. ఈ నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు కేరళకు చెందిన.. షాప్ కీపర్ అబు ఖాలిద్ అల్ హింది కూడా ఉన్నట్లు తేలింది. అతడి వయస్సు ముప్పై […]

ఆఫ్ఘన్ గురుద్వారా దాడికి కేరళకు లింక్.. ఆ సూసైడ్ బాంబర్ ఎవరంటే..?
Follow us

| Edited By:

Updated on: Mar 27, 2020 | 8:42 PM

గత రెండు మూడు రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని సిక్కు మతస్థులకు చెందిన గురుద్వారాపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నపిల్లలతో సహా.. మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ గురుద్వారాపై దాడి చేసింది మొత్తం నలుగురు ఉగ్రవాదులని అక్కడి పోలీస్‌ అధికారులు గుర్తించారు. ఈ నలుగురు ఉగ్రవాదుల్లో ఒకరు కేరళకు చెందిన.. షాప్ కీపర్ అబు ఖాలిద్ అల్ హింది కూడా ఉన్నట్లు తేలింది. అతడి వయస్సు ముప్పై ఏళ్లు. ఇతడి ఫోటోను శుక్రవారం ఐసీస్ విడుదల చేసింది.

అయితే ఈ అల్ హింది.. అసలు పేరు మొహమ్మద్ సాజిద్ కుథిరుల్‌మ్మల్. కేరళ రాష్ట్రానికి చెందిన కసర్‌గడ్‌‌లోని పడ్నె ప్రాంతానికి చెందినవాడు.అక్కడే షాప్‌కీపర్‌గా పనిచేసేవాడు. అయితే 2016లో ఇతడిపై ఎన్‌ఐఏ కేసు నమోదుచేసింది. అంతేకాదు.. ఇతడిపై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ అయింది. ఇదే 2016 సంవత్సరంలో కేరళ నుంచి పారిపోయిన 14 మంది ఉగ్రవాదుల్లో ఈ అల్ హింది కూడా ఉన్నాడు.