ఏలూరులో ఇంకా సాగుతోన్న వింతవ్యాధి సోధన, 12 ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ సేకరణ, క్లోరైడ్ అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తింపు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చెలరేగుతోన్న వింత వ్యాధి మూలాలేమిటో తెలుసుకునేందుకు సోధన ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా అనేక..

  • Venkata Narayana
  • Publish Date - 4:44 pm, Fri, 11 December 20
ఏలూరులో ఇంకా సాగుతోన్న వింతవ్యాధి సోధన, 12 ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ సేకరణ, క్లోరైడ్ అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తింపు

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చెలరేగుతోన్న వింత వ్యాధి మూలాలేమిటో తెలుసుకునేందుకు సోధన ఇంకా కొనసాగుతూనే ఉంది. గత వారం రోజులుగా అనేక మంది నిఫుణులు వివిధ నమూనాలను సేకరించి పలు అంశాలను ప్రస్తావించారు. అయితే, ఇంకా వింత వ్యాధి ఎందుకు సోకుతోందన్న దానిపై ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. తాజాగా ఏలూరులోని 12 ప్రాంతాల్లో నీటి శాంపిల్స్ సేకరణ చేసినట్టు పశ్చిమగోదావరి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ కుమార్ టీవీ9 తో చెప్పారు. వింత వ్యాధి బయట పడిన 12 ప్రాంతాల్లో సాంపిల్స్ ను సేకరించామన్నారు. క్లోరైడ్ అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. భూగర్భ జలాలతో పాటు మున్సిపల్ ట్యాప్ నీటిని కూడా సేకరించి పరిశీలించామన్నారు. వింత వ్యాధి కేసులు ఉన్న ప్రాంతాల్లోనే, బాధితుల ఇళ్ల వద్ద నుంచి సాంఫుల్స్ సేకరించినట్టు వెల్లడించారు. పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు అందించామన్నారు.